Royal Enfield Classic 350 : రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొనాలనుకుంటున్నారా? EMI ఎంత? వడ్డీ రేటు ఎంత పడుతుంది?
EMI ఎంత? వడ్డీ రేటు ఎంత పడుతుంది?

Royal Enfield Classic 350 : రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 చాలా సంవత్సరాలుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిళ్లలో ఒకటి. దీని క్లాసిక్ డిజైన్, పవర్ఫుల్ సౌండ్, స్ట్రాంగ్ పర్ఫామెన్స్, రోడ్ ప్రెజెన్స్ దీనిని భారత మార్కెట్‌లో ఒక పాపులర్ బైక్‌గా మార్చాయి. ఈ బైక్ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఒక ఫస్ట్ ఆప్షన్.
గత కొన్ని సంవత్సరాలుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఉత్పత్తి శ్రేణిని, ముఖ్యంగా 350cc, 650cc సెగ్మెంట్లలో గణనీయంగా విస్తరించింది. ప్రస్తుతం కంపెనీ చౌకైన బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350. అయినప్పటికీ, క్లాసిక్ 350 కంపెనీ అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌గా మిగిలిపోయింది. 2025లో కూడా ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ నంబర్ వన్ సెల్లింగ్ బైక్, ప్రతి నెలా 30,000 యూనిట్లకు పైగా అమ్ముడవుతోంది. దీని తర్వాత బుల్లెట్ 350, హంటర్ 350 ఉన్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350ని కొనాలని కలలు కంటున్నట్లయితే.. ఇది సరైన అవకాశం కావచ్చు. ప్రస్తుత జీఎస్టీ తగ్గింపు, పండుగల ఆఫర్లు, డిస్కౌంట్‌లు మీకు మంచి డీల్‌ను పొందడంలో సాయపడతాయి. మీరు కంప్లీట్ ఫైనాన్సింగ్‌పై (100% లోన్) కొనుగోలు చేయాలనుకుంటే, ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలో తెలుసుకుందాం.
ఈ బైక్ ధర రంగు వేరియంట్‌ను బట్టి రూ.1.81 లక్షల నుండి రూ.2.15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. మీరు బేస్ మోడల్ (రూ.1.81 లక్షలు) కొనాలని చూస్తున్నట్లయితే దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.2.09 లక్షలు ఉంటుంది. మీరు మొత్తం ధర కోసం లోన్ తీసుకోవచ్చు లేదా డౌన్ పేమెంట్ చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఫైనాన్స్ చేయవచ్చు.
సాధారణంగా మోటార్‌సైకిల్ లోన్‌లపై వడ్డీ రేటు 8% నుండి 20% వరకు ఉంటుంది. ఇది బ్యాంక్, లోన్ టైప్, మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. లోన్ కాల వ్యవధి, ప్రాసెసింగ్ ఫీజులు, లోన్ మొత్తం వంటి అంశాలు కూడా మొత్తం ఖర్చును ప్రభావితం చేస్తాయి. మీరు బైక్ ఆన్-రోడ్ ధరలో 100% వరకు లోన్ తీసుకుని, వడ్డీ రేటు 8%గా అనుకుంటే, మీ నెలవారీ EMI లోన్ కాల వ్యవధి (12 నెలల నుండి 60 నెలల వరకు) ఆధారంగా రూ.18,181 నుండి రూ.4,238 వరకు ఉంటుంది. మొత్తంగా, మీరు రూ.9,167 నుండి రూ.45,266 వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

