Royal Enfield : బైక్ అంటే ఇలా ఉండాలి..ప్రపంచాన్ని వణికించేందుకు వస్తున్న కాంటినెంటల్ జీటీ 650
ప్రపంచాన్ని వణికించేందుకు వస్తున్న కాంటినెంటల్ జీటీ 650

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులకు శుభవార్త. తన పాపులర్ కేఫే రేసర్ మోడల్ కాంటినెంటల్ జిటి 650కు కంపెనీ అదిరిపోయే అప్‌డేట్ ఇవ్వబోతోంది. ఇప్పటికే 750cc వేరియంట్‌పై ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో, ప్రస్తుతమున్న 650cc మోడల్‌ను కూడా మరింత ప్రీమియం ఫీచర్లతో 2026 చివరలో మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. అప్‌డేటెడ్ మోడల్‌లో రాబోయే మార్పులు, అంచనా ధరల వివరాలు తెలుసుకుందాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మిడ్-లైఫ్ అప్‌డేట్ మోడల్‌ను 2026 చివరి త్రైమాసికంలో (అక్టోబర్ - డిసెంబర్) లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే EICMA 2025లో 750cc మోడల్‌ను ప్రదర్శించినప్పటికీ, 650cc బైక్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా దీనిని కొనసాగిస్తూనే మరిన్ని మెకానికల్ మార్పులు చేయాలని కంపెనీ నిర్ణయించింది.
ఏం మారబోతోంది?
కొత్త కాంటినెంటల్ జిటి 650 కేవలం రంగుల మార్పుకే పరిమితం కాకుండా, రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేలా పలు మార్పులతో వస్తోంది.
బ్రేకింగ్ సిస్టమ్: ముందు భాగంలో ప్రస్తుతం ఉన్న సింగిల్ డిస్క్‌కు బదులుగా, మరింత శక్తివంతమైన ట్విన్-డిస్క్ బ్రేక్ సెటప్ వచ్చే అవకాశం ఉంది.
సస్పెన్షన్: ప్రస్తుతం ఉన్న టెలిస్కోపిక్ ఫోర్క్స్ స్థానంలో మరింత ప్రీమియం, అప్‌మార్కెట్ సస్పెన్షన్ యూనిట్లు రాబోతున్నాయి.
లుక్, డిజైన్: కొత్త కలర్ ఆప్షన్లు, అప్‌డేటెడ్ గ్రాఫిక్స్‌తో పాటు ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటి ఫీచర్లు మరింత ఆకర్షణీయంగా ఉండనున్నాయి.
ఇంజిన్: ఇంజిన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అదే నమ్మకమైన 648cc ప్యారలల్-ట్విన్ ఇంజిన్ (47 PS పవర్, 52 Nm టార్క్) కొనసాగనుంది.
ధర, పోటీ
ప్రస్తుతం ఈ బైక్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ.3.50 లక్షల నుంచి రూ.3.82 లక్షల వరకు ఉంది. అయితే, వస్తున్న ప్రీమియం అప్‌డేట్ల వల్ల కొత్త మోడల్ ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లో ఇంటర్‌సెప్టర్ 650, క్లాసిక్ 650 మోడళ్ల మధ్య స్థానాన్ని పదిలం చేసుకోనుంది.

