ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Royal Enfield : రాయల్ ఎన్ఫీల్డ్ తన జె-సిరీస్ ప్లాట్‌ఫారమ్‌లో మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. 2026 ఎడిషన్ గోవాన్ క్లాసిక్ 350 బైక్ ఇప్పుడు కొత్త ఫీచర్లతో షోరూమ్‌లలో సందడి చేస్తోంది. క్లాసిక్ లుక్‌ను ఏమాత్రం మార్చకుండా, రైడింగ్‌ను మరింత సులభతరం చేసేలా కంపెనీ మెకానికల్ మార్పులు చేసింది. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్‌లో ప్రయాణించే వారికి, లాంగ్ రైడ్స్ వెళ్లే వారికి ఈ కొత్త అప్‌డేట్స్ ఎంతో ఊరటనిస్తాయి.

ఈ 2026 మోడల్‌లో అతిపెద్ద మార్పు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్. దీనివల్ల క్లచ్ చాలా తేలికగా ఉంటుంది. ట్రాఫిక్‌లో మాటిమాటికి గేర్లు మార్చినా చేతికి నొప్పి రాదు. అలాగే స్పీడ్ సెట్టింగ్‌లో గేర్లు తగ్గించినప్పుడు వెనుక చక్రం స్లిప్ అవ్వకుండా ఇది రక్షణ ఇస్తుంది. ఇక టెక్నాలజీ పరంగా చూస్తే, ఇందులో కొత్తగా USB Type-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. దీని ద్వారా ప్రయాణంలో మీ మొబైల్ ఫోన్‌ను చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

ఇంజిన్ విషయంలో కంపెనీ ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో అదే నమ్మకమైన 349cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 20.2 bhp పవర్, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో వచ్చే ఈ బైక్, ప్రశాంతమైన, స్థిరమైన ప్రయాణానికి కేరాఫ్ అడ్రస్. డిజైన్ పరంగా.. సింగిల్ సీట్ బాబర్ స్టైల్, వైట్‌వాల్ టైర్లు, ఎత్తైన హ్యాండిల్ బార్, స్లాష్-కట్ ఎగ్జాస్ట్ (సైలెన్సర్) దీనికి వింటేజ్ లుక్ ఇస్తాయి.

కస్టమర్ల ఇష్టానికి అనుగుణంగా ఈ బైక్ నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.షాక్ బ్లాక్, పర్పుల్ హేజ్ రూ. 2,19,787 (ఎక్స్-షోరూమ్). ట్రిప్ టీల్ గ్రీన్, రేవ్ రెడ్ రూ. 2,22,593 (ఎక్స్-షోరూమ్). మార్కెట్లో దీనికి పోటీగా జావా 42 బాబర్, జావా పెరాక్, హోండా CB350, హార్లే-డేవిడ్సన్ X440, యెజ్డీ రోడ్‌స్టర్ వంటి దిగ్గజ బైకులు ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story