జీఎస్టీ కట్ తర్వాత మరింత చవక

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్స్ అంటే ఇష్టపడేవారికి గుడ్ న్యూస్. జీఎస్టీ తగ్గింపు తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి అత్యంత చవకైన బైక్‌గా పేరు తెచ్చుకున్న హంటర్ 350 ధర మరింత తగ్గింది. ఈ దీపావళికి ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు ఆన్‌రోడ్ ధర, డౌన్ పేమెంట్, ఈఎంఐ వివరాలను తెలుసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం, ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.38 లక్షల నుండి ప్రారంభమవుతోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.38 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఆర్టీవో ఛార్జీలు, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలతో కలిపి దీని ఆన్‌రోడ్ ధర సుమారు రూ.1.60 లక్షలు వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ఆన్‌రోడ్ ధర మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి, నగరాన్ని బట్టి మారవచ్చు.

హంటర్ 350 బైక్‌ను ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే, మీరు కనీసం రూ.10,000 డౌన్ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మిగిలిన రూ.1.50 లక్షల మొత్తాన్ని లోన్ రూపంలో తీసుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోరు బాగుండి, ఈ లోన్ 9% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి మంజూరైతే, మీ నెలవారీ EMI దాదాపు రూ.4,756 అవుతుంది. ఫైనాన్స్ తీసుకునే ముందు అన్ని డాక్యుమెంట్లను, నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించడం ముఖ్యం.

హంటర్ 350 లో పవర్ఫుల్ 349సీసీ J-సిరీస్ ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ లభిస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ 20.2 బీహెచ్‌పీ పవర్, 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో జత చేయబడింది. ఈ శక్తివంతమైన ఇంజిన్ బైక్‌కు మంచి పికప్, స్మూత్ డ్రైవింగ్‌ను అందిస్తుంది. కొత్త కలర్ ఎడిషన్ల కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లు, అధికారిక వెబ్‌సైట్లలో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మార్కెట్‌లో ఉన్న రెట్రో-స్టైల్ బైక్‌లకు గట్టి పోటీని ఇస్తుంది. ముఖ్యంగా టీవీఎస్ రోనిన్, హోండా హైనెస్ CB350 / CB350 RS వంటి బైక్‌లతో ఇది నేరుగా పోటీ పడుతోంది. అలాగే, జావా 42, బుల్లెట్ 350 కూడా దీనికి ప్రత్యర్థులుగా ఉన్నాయి. అయితే జావా 42 కొంచెం ఎక్కువ ధర కలిగి ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story