Hyundai i20 : స్విఫ్ట్, బలెనోకు షాక్.. హ్యుందాయ్ స్టైలిష్ మోడల్ పై ఏకంగా రూ.70000ల తగ్గింపు

Hyundai i20 : కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. హుందాయ్ ఈ జూలై నెలలో తన ప్రముఖ మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. అందులో భాగంగా హుందాయ్ i20 అనే పాపులర్ హ్యాచ్‌బ్యాక్‌పై వేల రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్‌లో హుందాయ్ i20 కొనుగోలుపై కస్టమర్‌లు గరిష్టంగా రూ.70,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ గురించి మరింత సమాచారం కోసం దగ్గరలోని హుందాయ్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. భారత మార్కెట్‌లో హుందాయ్ i20, మారుతి సుజుకి బలెనో, స్విఫ్ట్ వంటి కార్లతో పోటీపడుతుంది. ఇప్పుడు హుందాయ్ i20 ఫీచర్లు, ఇంజిన్ వివరాలు, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

కారు ఫీచర్లు అదుర్స్

హుందాయ్ i20 లోపలి భాగంలో కస్టమర్‌లకు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, కారులో సేఫ్టీ కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా అందించారు. ఇవి కారును మరింత సురక్షితంగా చేస్తాయి.

ఇంజిన్ వివరాలు

పవర్‌ట్రైన్ పరంగా హుందాయ్ i20 లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 83bhp పవర్‌ను, 115Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కారు ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జత చేశారు.

ధర వివరాలు

హుందాయ్ i20 ఒక 5-సీటర్ హ్యాచ్‌బ్యాక్ కారు. ఇది ప్రస్తుతం కస్టమర్‌లకు 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది. భారత మార్కెట్‌లో హుందాయ్ i20 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.04 లక్షలు. టాప్ మోడల్ ధర రూ.11.25 లక్షల వరకు ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story