హ్యుందాయ్ ఈవీపై రూ.1.25 లక్షల తగ్గింపు

Hyundai : హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అదిరిపోయే అవకాశం. ప్రస్తుతం మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని, హ్యుందాయ్ తన పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. డీలర్‌షిప్ స్థాయిలో లభిస్తున్న ఈ ఆఫర్ల ద్వారా కస్టమర్లు ఏకంగా రూ.1.25 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఆఫర్లు స్టాక్, నగరాన్ని బట్టి మారుతుంటాయని గమనించాలి.

హ్యుందాయ్ క్రెటా ఈవీ కేవలం డిజైన్‌లోనే కాదు, పర్ఫార్మెన్స్‌లోనూ దూసుకుపోతోంది. ముఖ్యంగా 2025 మోడళ్లపై డీలర్లు రూ.75,000 నుంచి రూ.1.25 లక్షల వరకు భారీ రాయితీలను అందిస్తున్నారు. ఈ ఆఫర్లు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా ఇతర బెనిఫిట్స్ రూపంలో ఉండవచ్చు. కచ్చితమైన వివరాల కోసం మీ సమీప హ్యుందాయ్ షోరూమ్‌ను సంప్రదించడం ఉత్తమం.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది.. ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, స్మార్ట్ (O), ప్రీమియం, స్మార్ట్ (O) LR, ఎక్సలెన్స్ LR. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ.18.02 లక్షల నుంచి రూ.24.70 లక్షల వరకు ఉన్నాయి. కస్టమర్లు తమ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా సరైన వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.

బ్యాటరీ, రేంజ్

ఈ కారులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి.

42 kWh బ్యాటరీ: ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 390 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కు పర్ఫెక్ట్.

51.4 kWh (LR - లాంగ్ రేంజ్): ఇది సుమారు 473 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. హైవే ప్రయాణాలకు ఇది బెస్ట్ ఆప్షన్. లాంగ్ రేంజ్ వేరియంట్ కేవలం 7.9 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

ఛార్జింగ్ సమయం

డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే పెద్ద బ్యాటరీ ప్యాక్ కేవలం 58 నిమిషాల్లోనే 10% నుంచి 80% వరకు ఛార్జ్ అవుతుంది. అదే 11 kW ఏసీ హోమ్ ఛార్జర్‌తో అయితే కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 4.5 గంటల సమయం పడుతుంది.

అత్యాధునిక ఫీచర్లు

క్రేటా ఎలక్ట్రిక్ కేవలం వేగమే కాదు, విలాసవంతమైన ఫీచర్లతో కూడా వస్తుంది.

డిస్ప్లే: డ్యూయల్ 10.25-ఇంచ్ స్క్రీన్ సెటప్ (ఇన్ఫోటైన్మెంట్ & డ్రైవర్ డిస్ప్లే).

ఆడియో: 8-స్పీకర్ల అదిరిపోయే బోస్ (Bose) ఆడియో సిస్టమ్.

సేఫ్టీ: 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS సేఫ్టీ సూట్.

అదనపు ఫీచర్లు: పనోరమిక్ సన్‌రూఫ్, వెహికల్-టు-లోడ్ (V2L) ఛార్జింగ్ సదుపాయం, డ్యూయల్ జోన్ ఏసీ.

PolitEnt Media

PolitEnt Media

Next Story