కేవలం రూ.4.62లక్షలకు వచ్చే చౌకైన సీఎన్జీ కార్లు ఇవే

CNG Cars : పెరుగుతున్న పెట్రోల్ ధరలతో విసిగిపోయారా? మీ బడ్జెట్ రూ.6 లక్షల లోపే దొరికే సీఎన్‌జీ కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వీటిపై ఓ లుక్కేయండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీనిచ్చే సీఎన్‌జీ కార్లు భారతదేశంలో వేగంగా ప్రజాదరణ పొందుతున్నాయి. భారతదేశంలో లభిస్తున్న 5 అత్యంత చవకైన సీఎన్‌జీ కార్ల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఈ కార్లు కేవలం రూ.4.62 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. అంతేకాక ఆధునిక ఫీచర్లు, బెస్ట్ మైలేజీని అందిస్తాయి.

మారుతి ఎస్-ప్రెస్సో సీఎన్‌జీ

ఈ జాబితాలో అత్యంత చౌకైన కారు మారుతి ఎస్-ప్రెస్సో సీఎన్‌జీ. దీని ప్రారంభ ధర రూ.4.62 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో 1.0 లీటర్ కే-సిరీస్ పెట్రోల్-సీఎన్‌జీ ఇంజిన్ ఉంది, ఇది 56 పీఎస్ పవర్, 82.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కిలోకు 32.73 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ తో పాటు ఈబీడీ, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, ఈఎస్పీ, 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

మారుతి ఆల్టో కే10 సీఎన్‌జీ

మైలేజ్ క్వీన్ గా పేరున్న మారుతి ఆల్టో కే10 సీఎన్‌జీ ఫ్యామిలీలకు, సిటీలో డ్రైవింగ్‌కు మంచి ఎంపిక. దీని ధర రూ.4.82 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కారులో 998సీసీ కే10సీ ఇంజిన్ ఉంది, ఇది 56 పీఎస్ పవర్, 82.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్‌ఏఐ ధృవీకరణ ప్రకారం ఇది కిలోకు 33.85 కి.మీ మైలేజీని ఇస్తుంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్పీ, వెనుక సెన్సార్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 214 లీటర్ల బూట్ స్పేస్ కూడా లభిస్తుంది.

టాటా టియాగో సీఎన్‌జీ

ఈ జాబితాలో అత్యంత సురక్షితమైన తక్కువ ధర సీఎన్‌జీ కారు టాటా టియాగో. దీనికి జీఎన్‌సీఏపీ ద్వారా 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. దీని ప్రారంభ ధర రూ.5.49 లక్షల నుంచి ఉంది. ఇందులో 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజిన్ ఉంది, ఇది 72 పీఎస్ పవర్, 95 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ మోడల్‌లో కిలోకు 26.49 కి.మీ, ఏఎమ్‌టీ మోడల్‌లో కిలోకు 28.06 కి.మీ మైలేజీని ఇస్తుంది.

మారుతి వాగన్ ఆర్ సీఎన్‌జీ

భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న క్యాబ్, పర్సనల్ కార్లలో వాగన్ ఆర్ ఒకటి. దీని ప్రారంభ ధర రూ.5.89 లక్షల నుంచి ఉంది. ఇందులో 998సీసీ కే10సీ ఇంజిన్ ఉంది, ఇది 56 పీఎస్ పవర్, 82.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్‌ఏఐ ధృవీకరణ ప్రకారం ఇది కిలోకు 34.05 కి.మీ మైలేజీని అందిస్తుంది. దీనికి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈఎస్పీ, వెనుక సెన్సార్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సెలెరియో సీఎన్‌జీ

మారుతి సెలెరియో సీఎన్‌జీ భారతదేశంలో అత్యంత ఎక్కువ ఇంధన సామర్థ్యం అంటే మైలేజ్ కలిగిన సీఎన్‌జీ కారు. దీని ప్రారంభ ధర రూ.5.98 లక్షల నుంచి ఉంది. ఇందులో 998సీసీ కే10సీ ఇంజిన్ ఉంది, ఇది 56 పీఎస్ శక్తిని మరియు 82.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అద్భుతమైన కిలోకు 34.43 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్పీ, 7-అంగుళాల టచ్‌స్క్రీన్, కీ లెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 313 లీటర్ల బూట్ స్పేస్ కూడా లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story