లీటరుకు ఏకంగా 27.97 కి.మీ. మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీ

Maruti Suzuki Grand Vitara : పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో మంచి మైలేజ్ ఇచ్చే కారు ఉంటే ఎంత బాగుంటుంది కదా? ఎక్కువ మైలేజ్ ఇచ్చే అదిరపోయే ఎస్యూవీ గురించి ఈ వార్తలో తెలుసుకుందాం. ఈ ఎస్‌యూవీ పేరే మారుతి సుజుకి గ్రాండ్ విటారా. ఇది కేవలం అదిరిపోయే ఫీచర్లతోనే కాదు, మంచి మైలేజ్‌తో కూడా కస్టమర్ల మనసు గెలుచుకుంటోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇస్తున్న ఈ ఎస్‌యూవీకి ఇప్పుడు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అయితే, ఈ కారు కొనాలనుకునే ముందు ఒక లీటరు పెట్రోల్‌కు ఇది ఎంత మైలేజ్ ఇస్తుందో చూద్దాం.

కంపెనీ అధికారిక సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఎస్‌యూవీ మైలేజ్ వేర్వేరు వేరియంట్‌లకు వేర్వేరుగా ఉంటుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇ-సీవీటీ వేరియంట్లో కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఇది అత్యధిక మైలేజ్ ఇస్తుంది. ఈ మోడల్ ఒక లీటరు పెట్రోల్‌కు 27.97 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది ఈ సెగ్మెంట్‌లో చాలా ఎక్కువ. స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్స్ 19.38 నుండి 21.11 కి.మీ.ల వరకు మైలేజ్ అందిస్తాయి. సీఎన్‌జీ వేరియంట్ ఒక కిలో సీఎన్‌జీకి 26.6 కి.మీ.ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ ఎస్‌యూవీ ధర రూ.11.42 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ.20.52 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

మార్కెట్లో దీనికి పోటీగా ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మైలేజ్ పరిశీలిస్తే.. హ్యుందాయ్ క్రెటా డీజిల్ (మాన్యువల్) వేరియంట్ లీటరుకు 21.8 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ (డీజిల్) వేరియంట్ 19.1 కి.మీ.ల వరకు మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ (ఆటోమేటిక్) వేరియంట్ ఒక లీటరుకు 18.4 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ (మాన్యువల్) వేరియంట్ 17.4 కి.మీ.ల వరకు వెళ్తుంది. ఈ పాపులర్ ఎస్‌యూవీ ధర రూ.11,10,900 (ఎక్స్-షోరూమ్) నుండి రూ.20,49,800 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

కియా సెల్టోస్ మైలేజ్ చూస్తే.. డీజిల్ (మాన్యువల్) వేరియంట్ 20.7 కి.మీ.ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ (డీజిల్) వేరియంట్ కూడా 20.7 కి.మీ.ల వరకు మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ (మాన్యువల్) వేరియంట్ 17.7 కి.మీ.ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ (పెట్రోల్) వేరియంట్ 17.9 కి.మీ.ల వరకు వెళ్తుంది. సెల్టోస్ బేస్ వేరియంట్ ధర రూ.11,18,900 (ఎక్స్-షోరూమ్) నుండి రూ.20, 55, 900 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ మైలేజ్, క్రెటా, సెల్టోస్ డీజిల్ వేరియంట్ల కంటే కూడా ఎక్కువగా ఉంది. అందుకే మైలేజ్ కోసం చూసే వారికి గ్రాండ్ విటారా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story