Simple Energy : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిమీ..సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ సునామీ
సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ సునామీ

Simple Energy : ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తూ, బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ తన నెక్స్ట్ జనరేషన్ స్కూటర్లను రంగంలోకి దించింది. జనవరి 2026లో జరిగిన గ్రాండ్ లాంచ్‌లో భాగంగా సింపుల్ వన్ జెన్ 2తో పాటు, దేశంలోనే అత్యధిక రేంజ్ ఇచ్చే సింపుల్ అల్ట్రా స్కూటర్‌ను కూడా పరిచయం చేసింది. రేంజ్ ఆందోళన ఉన్నవారికి ఇది సరైన సమాధానం అని కంపెనీ చెబుతోంది.
ఈ లాంచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది సింపుల్ అల్ట్రా మోడల్. ఇందులో భారీ 6.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిమీల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంత రేంజ్ ఇచ్చే స్కూటర్లు చాలా అరుదు. ఇది కేవలం 2.77 సెకన్లలోనే 0-40 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడు గంటకు 115 కిమీ.
సింపుల్ వన్ జెన్ 2 సిరీస్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అవి సింపుల్ వన్ S ఇది 3.7 kWh బ్యాటరీని కలిగి ఉండి 190 కిమీ రేంజ్ ఇస్తుంది. సింపుల్ వన్.. ఇది 4.5 kWh బ్యాటరీ కలిగి ఉండి 236 కిమీ రేంజ్, 90 కిమీ టాప్ స్పీడ్ ఇస్తుంది.
సింపుల్ వన్ వేరియంట్ గరిష్టంగా 5 kWh బ్యాటరీ కలిగి ఉండి 265 కిమీ రేంజ్, 115 కిమీ టాప్ స్పీడ్ అందుకుంటుంది. ఈ కొత్త జెన్ 2 మోడళ్లలో ఛాసిస్‌ను రీడిజైన్ చేశారు, దీనివల్ల స్కూటర్ స్థిరత్వం 22% పెరిగింది. అలాగే సీటు ఎత్తును 16 మిమీ తగ్గించి, రైడింగ్ మరింత సౌకర్యవంతంగా మార్చారు.
ఈ స్కూటర్లు కొత్త Simple OS పై నడుస్తాయి. ఇందులో 7-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, 5G e-SIM కనెక్టివిటీ, ట్యాంపర్ అలర్ట్, జియోఫెన్సింగ్, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ట్రాక్షన్ కంట్రోల్, 360-డిగ్రీ ప్రొటెక్షన్, డ్రాప్ సేఫ్ (స్కూటర్ పడిపోతే మోటార్ ఆఫ్ అయ్యే ఫీచర్), హిల్ హోల్డ్ వంటి ఫీచర్లు కూడా జోడించారు. అండర్ సీట్ స్టోరేజ్ సామర్థ్యాన్ని 35 లీటర్లకు పెంచారు.
సింపుల్ ఎనర్జీ ఒక భారీ ప్రకటన చేస్తూ.. తన జెన్ 2 స్కూటర్ల బ్యాటరీ, మోటార్‌పై లైఫ్‌టైమ్ వారంటీ ప్రకటించింది. ధరల విషయానికి వస్తే, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద ప్రారంభ ధర రూ.1,39,999 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. దీని టాప్ వేరియంట్ ధర రూ.1,77,999 వరకు ఉంటుంది. ఈ స్కూటర్లు ఓలా S1 ప్రో, ఏథర్ 450X, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

