.కుషాక్, స్లావియా కార్లపై ఏకంగా రూ.లక్ష తగ్గింపు

Skoda : స్కోడా ఇండియా 2026 కొత్త సంవత్సరాన్ని గ్రాండ్‌గా ప్రారంభించింది. తన కస్టమర్ల కోసం ఎస్‌యూవీ,సెడాన్ పోర్ట్‌ఫోలియోపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్లు స్కోడా కుషాక్, స్లావియా, కైలాక్, కోడియాక్ మోడళ్లపై వర్తిస్తాయి. ఈసారి కంపెనీ నేరుగా క్యాష్ డిస్కౌంట్ కంటే కూడా ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్, లాయల్టీ బెనిఫిట్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. దీనివల్ల పాత కారును ఇచ్చి కొత్త స్కోడా కారును తీసుకోవాలనుకునే వారికి భారీగా లాభం చేకూరనుంది.

స్కోడా బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీ కుషాక్, ప్రీమియం సెడాన్ స్లావియా పై గరిష్టంగా రూ.లక్ష వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, మరో రూ.50,000 వరకు కార్పొరేట్ లేదా లాయల్టీ బోనస్ ఉంది. మీరు ఇప్పటికే స్కోడా కారు వాడుతుంటే (లాయల్టీ) లేదా ఏదైనా మంచి సంస్థలో ఉద్యోగం చేస్తుంటే (కార్పొరేట్) ఈ బెనిఫిట్ మీకు సొంతమవుతుంది. మధ్యతరగతి ఫ్యామిలీలకు ఈ ఆఫర్ ఒక వరం లాంటిది.

స్కోడా నుంచి ఇటీవల విడుదలైన సబ్-4 మీటర్ ఎస్‌యూవీ కైలాక్ పై కూడా కంపెనీ ఆఫర్లు ఇచ్చింది. దీనిపై రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా లాయల్టీ బెనిఫిట్ లభిస్తోంది. కేవలం ఏడాది కాలంలోనే కైలాక్ 50 వేల యూనిట్ల ప్రొడక్షన్ మార్కును దాటడం విశేషం. ఇక కంపెనీ లగ్జరీ ఎస్‌యూవీ కోడియాక్ పై కూడా లక్ష రూపాయల వరకు ప్రయోజనం లభిస్తోంది, అయితే ఇది స్టాక్ లభ్యత, డీలర్ల ఆధారంగా మారుతూ ఉంటుంది.

ఈ ఆఫర్లు కేవలం జనవరి నెల ఆఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి సేఫ్టీకి పెద్దపీట వేసే స్కోడా కార్లను తక్కువ ధరకే దక్కించుకోవాలనుకునే వారు వెంటనే దగ్గరలోని షోరూమ్‌ను సంప్రదించడం మంచిది. యూరోపియన్ డ్రైవింగ్ అనుభూతిని సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story