సీఎన్‌జీ కారులోనూ సేఫ్టీ టాప్ నాచ్

Tata Altroz : ఆటోమొబైల్ రంగంలో సేఫ్టీకి ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలో టాటా మోటార్స్ తయారు చేసిన టాటా అల్ట్రోజ్ సీఎన్‌జీ కారు ఒక అద్భుతమైన రికార్డు సృష్టించింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను పొందిన తొలి సీఎన్‌జీ కారుగా అల్ట్రోజ్ నిలిచింది. టెస్ట్ ఫలితాల ప్రకారం.. అల్ట్రోజ్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విభాగంలో 32కి గాను 29.65 పాయింట్లను, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) విభాగంలో 49కి గాను 44.90 పాయింట్లను సాధించింది. ఇది ఈ సెగ్మెంట్‌లో చాలా మెరుగైన ఫలితం.

భారత్ ఎన్‌సీఏపీ అంటే ఏమిటి?

భారత్ ఎన్‌సీఏపీ అనేది వాహనాల సేఫ్టీని పరీక్షించే ఒక రేటింగ్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో కార్లకు కఠినమైన క్రాష్ టెస్టులు నిర్వహిస్తారు. 5-స్టార్ రేటింగ్ అంటే ఆ కారు క్రాష్ సమయంలో అత్యంత పటిష్టమైన భద్రతను అందిస్తుంది. ఈ రేటింగ్‌తో పాటు కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పాదచారుల రక్షణ, సైడ్-ఇంపాక్ట్ హెడ్ ప్రొటెక్షన్, సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని ధృవీకరించబడుతుంది. అల్ట్రోజ్ సీఎన్‌జీలో ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్‌లు, లోడ్ లిమిటర్‌లు, అన్ని ప్రయాణికులకు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ మైలురాయిని సాధించినందుకు టాటా మోటార్స్‌ను అభినందించారు. టాటా మోటార్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో అల్ట్రోజ్ భారతదేశంలో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ఆప్షన్లలో లభించే ఏకైక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అని పేర్కొంది. ఇది అన్ని పవర్ ట్రైన్లలో 5-స్టార్ రేటింగ్ పొందిన మొదటి కారు అని తెలిపింది.

టాప్ లిస్ట్‌లో ఇతర కార్లు

భారత్ ఎన్‌సీఏపీలో ఇప్పటివరకు మొత్తం 22 కార్లు పరీక్షించబడ్డాయి. అడల్ట్ సేఫ్టీ (AOP)లో మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఈ, టాటా హారియర్.ఈవీ మాత్రమే పూర్తి మార్కులు సాధించాయి. చైల్డ్ సేఫ్టీలో ఏ కారు కూడా పూర్తి 49 పాయింట్లు సాధించలేదు. అయితే, మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఈ, మహీంద్రా బీఈ 6, టాటా హారియర్.ఈవీ, టయోటా ఇన్నోవా హైక్రాస్, టాటా పంచ్.ఈవీ, మహీంద్రా థార్ రాక్స్, స్కోడా కైలాక్ వంటి ఏడు కార్లు 45 పాయింట్లకు పైగా సాధించాయి. ఈ రేటింగ్‌లు వాహనాల సేఫ్టీ విషయంలో వినియోగదారుల ప్రాధాన్యతలను పెంచుతున్నాయి. కంపెనీలు కేవలం ధరలు, ఫీచర్ల మీద మాత్రమే కాకుండా, ఇప్పుడు క్రాష్ సేఫ్టీపై కూడా పోటీపడుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story