కొత్త కారు కూడా 5 స్టార్ రేటింగ్‌తో అదరగొట్టింది

Tata Altroz : భారత మార్కెట్‌లో టాటా మోటార్స్ కార్లు అంటేనే సేఫ్టీకి మారు పేరుగా పేర్గాంచాయి. ఇప్పుడు, టాటా ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ కారు టాటా అల్ట్రోజ్కు కూడా భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. దీనితో ఇది జూలై 2025లో 4 స్టార్ రేటింగ్ పొందిన మారుతి బాలెనో కన్నా మరింత సురక్షితమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచింది.

టాటా అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ సేఫ్టీ స్కోర్లు

పెద్దల భద్రత :

ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్: 16 పాయింట్లకు 15.55 పాయింట్లు.

సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్: 16 పాయింట్లకు 14.11 పాయింట్లు.

సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ (పోల్): ఈ టెస్ట్‌లో కూడా కారు అద్భుతమైన పనితీరు కనబరిచింది.

పిల్లల భద్రత :

డైనమిక్ స్కోర్: 24 పాయింట్లకు 23.90 పాయింట్లు.

చైల్డ్ సీట్ ఇన్‌స్టాలేషన్ స్కోర్: 12 పాయింట్లకు 12 పాయింట్లు.

వాహన అంచనా స్కోర్: 13 పాయింట్లకు 9 పాయింట్లు.

చైల్డ్ సేఫ్టీలో అద్భుతమైన పనితీరు

పిల్లల భద్రతకు సంబంధించిన టెస్ట్‌లో, టాటా అల్ట్రోజ్ కారులో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంక్రేజ్ సహాయంతో చైల్డ్ రెస్టింట్ సిస్టమ్‌ను రివర్స్ డైరెక్షన్‌లో అమర్చారు. 3 సంవత్సరాల పిల్లల డమ్మీకి ఫ్రంటల్ క్రాష్ టెస్ట్‌లో 8కి 8 పాయింట్లు, సైడ్ క్రాష్ టెస్ట్‌లో 4కి 4 పాయింట్లు లభించాయి. 18 నెలల పిల్లల డమ్మీకి ఫ్రంటల్ క్రాష్ టెస్ట్‌లో 8కి 7.90 పాయింట్లు లభించాయి. సైడ్ క్రాష్ టెస్ట్‌లో మాత్రం పూర్తి పాయింట్లు వచ్చాయి. ఇదే కారణంగా అల్ట్రోజ్ చైల్డ్ సేఫ్టీ డైనమిక్ స్కోర్ 24కి 23.90గా ఉంది.

టాటా అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు

టాటా అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, వెనుక సీట్లలో ఐసోఫిక్స్ చైల్డ్-సీట్ మౌంట్‌లు కూడా ఉన్నాయి.

ధర, ఇతర వివరాలు

టాటా అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.89 లక్షల నుంచి రూ. 11.49 లక్షల వరకు ఉంది. ఈ కారు మార్కెట్‌లో మారుతి బాలెనో, హ్యుండాయ్ ఐ20, టయోటా గ్లాంజా వంటి కార్లతో పోటీ పడుతుంది. ఈ కారులో కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, పెద్ద డిజిటల్ డిస్‌ప్లే (10.25-అంగుళాలు), వాయిస్-యాక్టివేటెడ్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఆధునిక ఫీచర్లు లభిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story