Tata Motors : హారియర్, సఫారీ కొంటే భారీ డిస్కౌంట్.. ఏప్రిల్ నెలలో టాటా బంపర్ డీల్స్
ఏప్రిల్ నెలలో టాటా బంపర్ డీల్స్

Tata Motors : సొంత కారు కొనాలనే మీ కలను నెరవేర్చుకోవడానికి టాటా మోటార్స్ అదిరిపోయే అవకాశాన్ని ఇస్తోంది. ఏప్రిల్ 2026 నెలలో తన పాపులర్ మోడల్స్ అయిన హారియర్, సఫారి, నెక్సాన్, ఆల్ట్రోజ్ వంటి కార్లపై కంపెనీ భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా కస్టమర్లు వేల రూపాయలు ఆదా చేసుకునే వీలుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా కేవలం రూ.6.30 లక్షల ప్రారంభ ధరతోనే టాటా కార్లు అందుబాటులో ఉన్నాయి.
టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్ కార్లపై ఈ నెలలో బహుమతుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా టాటా నెక్సాన్, టాటా టియాగో మోడల్స్‌పై రూ.25,000 వరకు మొత్తం ప్రయోజనాలను అందిస్తోంది. నెక్సాన్ కొనుగోలుపై రూ.10,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. అదేవిధంగా, టియాగో హ్యాచ్‌బ్యాక్ పై రూ.15,000 నగదు డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అయితే, టియాగో బేస్ వేరియంట్ (XE) కు ఈ ఆఫర్లు వర్తించవని, కేవలం హై-ఎండ్ వేరియంట్లకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో దుమ్మురేపుతున్న టాటా ఆల్ట్రోజ్ పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. ఏప్రిల్ 2026లో ఈ కారును కొనుగోలు చేసే వారికి రూ.30,000 వరకు లాభం చేకూరుతుంది. ఇందులో రూ.15,000 నేరుగా నగదు తగ్గింపు ఉండగా, మరో రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో లభిస్తుంది. ప్రస్తుతం ఆల్ట్రోజ్ ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ వద్ద సుమారు రూ.6.30 లక్షలుగా ఉంది. మార్కెట్లో హ్యుందాయ్ i20, మారుతి సుజుకి బాలెనో వంటి కార్లకు ఆల్ట్రోజ్ గట్టి పోటీనిస్తోంది. ఈ డిస్కౌంట్లతో ఆల్ట్రోజ్ మరింత చేరువ కానుంది.
ఇక స్టైలిష్ ఎస్‌యూవీగా పేరుగాంచిన టాటా కర్వ్ పై అత్యధికంగా రూ.50,000 వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. ఇందులో రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కలిసి ఉన్నాయి. భారీ ఎస్‌యూవీలను ఇష్టపడే వారి కోసం టాటా హారియర్, టాటా సఫారీ లపై రూ.35,000 వరకు ప్రయోజనాలను టాటా మోటార్స్ ప్రకటించింది. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపుతో పాటు రూ.25,000 భారీ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. పాత కారును మార్చుకుని కొత్త ఎస్‌యూవీని తీసుకోవాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం.
అయితే అన్ని మోడల్స్‌పై ఈ డిస్కౌంట్లు లేవు. తాజాగా లాంచ్ అయిన టాటా సియెర్రా విపరీతమైన క్రేజ్ ఉన్న టాటా పంచ్ ఎస్‌యూవీలపై ఈ నెలలో ఎలాంటి ఆఫర్లు అందుబాటులో లేవు. టాటా మోటార్స్ కార్లు వాటి సేఫ్టీ రేటింగ్స్ (5-స్టార్)కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇప్పుడు ఈ డిస్కౌంట్లు తోడవడంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మీరు కారు కొనాలని భావిస్తే, ఈ నెల ముగిసేలోపు డీలర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.

