Tata Motors : టాటా మోటార్స్ మైండ్ బ్లాక్ ఆఫర్..కేవలం రూ.4,999 కే కారు..షోరూంల ముందు క్యూ కట్టిన జనం
షోరూంల ముందు క్యూ కట్టిన జనం

Tata Motors : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే ఛాన్స్. ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ డిసెంబర్ నెల కానుకగా తన కార్లపై బంపర్ ఆఫర్లను ప్రకటించింది. కేవలం రూ.4,999 ప్రారంభ ఈఎంఐతో టాటా కారును ఇంటికి తీసుకెళ్లే సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ఈ లోన్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది చివరి వరకు అంటే డిసెంబర్ 31, 2025 లోపు కారు కొనేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఈ స్కీమ్ కింద టాటా టియాగో కారు ఈఎంఐ అత్యంత తక్కువగా రూ.4,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే పాపులర్ మోడల్స్ అయిన టాటా పంచ్, టిగోర్ కార్లను నెలకు రూ.5,999 ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు ఆల్ట్రోజ్ (రూ.6,777), నెక్సాన్ (రూ.7,666), లేటెస్ట్ కారు కర్వ్ (రూ.9,999) ఈఎంఐలతో అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ కార్లకు 84 నెలల కాలపరిమితితో, 25-30% బెలూన్ స్కీమ్ (చివర్లో ఒకేసారి కొంత మొత్తం కట్టే వెసులుబాటు) ఆధారంగా ఈ ఈఎంఐలను లెక్కించారు.
ఇక ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తే, టియాగో.ev ఈఎంఐ రూ.5,999 తో మొదలవుతోంది. సేఫ్టీలో రారాజుగా పేరున్న పంచ్.ev నెలకు రూ.7,999 ఈఎంఐతో లభిస్తుంది. నెక్సాన్.ev కి రూ.10,999, ప్రీమియం మోడల్ కర్వ్.ev కి రూ.14,555 ఈఎంఐగా నిర్ణయించారు. ఎలక్ట్రిక్ కార్లకు మాత్రం ఏకంగా 120 నెలల (10 ఏళ్ల) సుదీర్ఘ లోన్ కాలపరిమితిని టాటా మోటార్స్ అందిస్తోంది. దీనివల్ల నెలవారీ భారం తగ్గి, సామాన్యులకు కూడా కారు కొనే శక్తి వస్తుంది. అయితే ఈ ఈఎంఐలు మీరు ఎంచుకునే మోడల్, నగరం, బ్యాంక్ నిబంధనలపై ఆధారపడి మారుతుంటాయి.
భారతదేశంలో సేఫ్టీకి మారుపేరుగా నిలిచిన టాటా మోటార్స్, ప్రస్తుతం దేశంలోనే మూడవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉంది. మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని సానంద్ ప్లాంట్ల నుంచి నాణ్యమైన కార్లను తయారు చేస్తోంది. దేశవ్యాప్తంగా 195 నగరాల్లో 3,500 కంటే ఎక్కువ సేల్స్, సర్వీస్ సెంటర్లతో టాటా నెట్‌వర్క్ విస్తరించి ఉంది. కస్టమర్ల సంతృప్తికి పెద్దపీట వేస్తూ, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో కార్లను అందిస్తున్న టాటా.. ఈ డిసెంబర్ ఆఫర్లతో మార్కెట్లో మరోసారి దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.

