Tata Punch 2025: టాటా పంచ్ పాపులర్ వేరియంట్లు నిలిపివేత.. వెబ్‌సైట్ నుంచి కూడా తొలగింపు!
వెబ్‌సైట్ నుంచి కూడా తొలగింపు!

Tata Punch 2025: పండుగ సీజన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసిన తర్వాత, టాటా మోటార్స్ తమ ఉత్పత్తుల లైనప్‌లో కొన్ని మార్పులు చేసింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, అధిక డిమాండ్ ఉన్న మోడల్‌ల డెలివరీ సమయాన్ని తగ్గించడానికి, కంపెనీ తమ అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో కొన్ని వేరియంట్‌లను నిలిపివేసింది. ఈ కోవలో కంపెనీకి అత్యధికంగా అమ్ముడవుతున్న రెండవ కారు అయిన టాటా పంచ్ నుంచి ముఖ్యమైన వేరియంట్‌లను తొలగించింది. ఇంతకీ మార్కెట్ నుంచి తొలగించిన ఆ వేరియంట్లు ఏవి? కొత్త టాటా పంచ్‌లో లభిస్తున్న ప్రీమియం ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.
రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగిన తర్వాత, టాటా మోటార్స్ సంస్థ తమ మోడళ్లలో కొన్ని మార్పులు చేసింది. ఉత్పత్తిని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి, అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్ల డెలివరీ సమయాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. టాటా పంచ్, నెక్సన్, టియాగో ఎన్‌ఆర్‌జీ మోడళ్లకు చెందిన కొన్ని వేరియంట్లను కంపెనీ నిలిపివేసింది. ముఖ్యంగా, టాటా పంచ్ అడ్వెంచర్, అడ్వెంచర్ S వేరియంట్లను లైన్-అప్ నుంచి, కంపెనీ వెబ్‌సైట్ నుంచి కూడా తొలగించింది. అడ్వెంచర్ వేరియంట్‌లో 3.5-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఆల్-పవర్ విండోస్, రియర్ ఏసీ వెంట్స్, ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్స్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు లభించేవి.
ప్రస్తుతం టాటా పంచ్ (పెట్రోల్, ఈవీ కలిపి) టాటా మోటార్స్ రెండవ అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. 2025 మోడల్‌లో టాటా మోటార్స్ మరింత ప్రీమియం ఫీచర్లను జోడించింది. కారు ఇంటీరియర్ ఇప్పుడు మరింత ప్రీమియంగా ఉంది. లెదరెట్-చుట్టిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో పాటు టాటా ప్రకాశవంతమైన లోగో ఇవ్వబడింది. ఇందులో 10.2-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేస్తుంది. డ్రైవర్ కోసం 7-అంగుళాల డిజిటల్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంది.
360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, పుష్-బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు టాప్ వేరియంట్లలో లభిస్తున్నాయి. కొత్త టాటా పంచ్ పెట్రోల్, సీఎన్‌జీ రెండు పవర్ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 87 bhp పవర్, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.09కిమీ మైలేజీని ఇస్తుంది. సీఎన్జీ వేరియంట్ 72 bhp పవర్, 103 Nm టార్క్‌ను అందిస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 26.99కిమీ మైలేజీని అందిస్తుంది. ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.

