Tata Motors : భారతదేశపు ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తిరుగులేని సామ్రాజ్యాన్ని నడుపుతున్న టాటా మోటార్స్ మరో మైండ్ బ్లాకింగ్ మెగా ప్లాన్‌తో సిద్ధమైంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్లతోనే కాకుండా.. రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్పై తన పట్టును మరింత గట్టిగా బిగించడానికి సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగానే బ్యాక్-టు-బ్యాక్ 3 సరికొత్త విప్లవాత్మక ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి దించడానికి లైన్ క్లియర్ చేసింది. కేవలం లుక్ మాత్రమే కాదు.. లగ్జరీ ఫీచర్లు, ఏకంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే బ్యాటరీలతో ఈ కార్లు సంచలనం సృష్టించబోతున్నాయి. టాటా సంస్థ తీసుకొస్తున్న ఈ సరికొత్త ఈవీ కార్లు నేరుగా మహీంద్రాతో పాటు ఇతర విదేశీ కార్ల కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

టాటా సియెర్రా ఈవీ

టాటా మోటార్స్ చరిత్రలోనే అత్యంత ఐకానిక్, సక్సెస్ ఫుల్ మోడల్ అయిన సియెర్రా ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో దుమ్మురేపడానికి సిద్ధమైంది. టాటా సియెర్రా ఈవీని కంపెనీ రాబోయే పండగల సీజన్ (జులై నుంచి సెప్టెంబర్ 2026) లోపు అధికారికంగా మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన దీని పెట్రోల్-డీజిల్ (ICE) వెర్షన్‌ తరహాలోనే.. ఈ ఎలక్ట్రిక్ మోడల్ కూడా సిగ్నేచర్ స్క్వేర్డ్ స్టాన్స్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్లు, నిటారుగా ఉండే స్ట్రెయిట్ రియర్ డిజైన్‌తో రాబోతోంది. ఇందులో అమర్చబోయే భారీ బ్యాటరీ ప్యాక్ సహాయంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని అంచనా.

టాటా అవిన్యా

టాటా మోటార్స్ ఇన్‌టెన్స్ ఈవీ రోడ్‌మ్యాప్‌లో అన్నింటికంటే అతిపెద్ద సంచలనం కాబోతోంది టాటా అవిన్యా. ఇది కేవలం ఒక కారు మాత్రమే కాదు.. టాటా ఈవీ ప్రయాణంలోనే ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. లగ్జరీ కార్ల మార్కెట్ ను టార్గెట్ చేస్తూ అత్యంత ప్రీమియం లైనప్‌లో టాటా దీనిని నిలబెట్టనుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2027 ద్వితీయార్థంలో (అక్టోబర్ 2026 నుంచి మార్చి 2027 మధ్య) ఈ సిరీస్ లోని మొదటి కారు రోడ్లపైకి వచ్చే ఛాన్స్ ఉంది. దీని కాన్సెప్ట్ మోడల్ లో చూపించిన విధంగా.. కారు లోపల లగ్జరీ లాంజ్ స్టైల్ సిట్టింగ్, అత్యంత క్లీన్ అండ్ మినిమలిస్టిక్ ఇంటీరియర్ లుక్, మరియు ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌టీరియర్ డిజైన్ దీని సొంతం. టయోటా కంపెనీకి లెక్సస్ బ్రాండ్ ఎలాగో.. టాటా కంపెనీకి అవిన్యా అలా ప్రీమియం బ్రాండ్ కాబోతోంది.

టాటా సఫారీ ఈవీ

టాటా ఈవీ ఫ్యామిలీలోనే అత్యంత ఖరీదైన, టాప్ ఎండ్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది టాటా సఫారీ ఈవీ. దీనిని రాబోయే దీపావళి పండగ సీజన్ లేదా 2027 ప్రారంభంలో మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ కారు మార్కెట్లోకి అడుగుపెట్టడమే.. మహీంద్రా కంపెనీకి చెందిన లేటెస్ట్ XEV 9S మోడల్‌కు డైరెక్ట్ విలన్‌గా మారనుంది. 3-రో లెఅవుట్‌తో వచ్చే ఈ భారీ ఎస్‌యూవీ లోపలి ఫీచర్లు, టెక్నాలజీ చాలా వరకు అప్‌కమింగ్ హారియర్ ఈవీని పోలి ఉంటాయి. 540-డిగ్రీల కెమెరా, అడ్వాన్స్డ్ లెవెల్ 2 ADAS సేఫ్టీ, ఆటో పార్క్ అసిస్ట్ వంటి హాలీవుడ్ రేంజ్ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story