మారుతికి పోటీ ఇచ్చేందుకు ఏకంగా 7 కొత్త కార్లు

Tata Motors : భారత మార్కెట్‌లో మారుతి సుజుకికి గట్టి పోటీ ఇచ్చేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. టాటా అనేక కొత్త తరం మోడళ్లు, ఫేస్‌లిఫ్ట్‌లు, స్పెషల్ ఎడిషన్లతో సహా ఏడు కొత్త వాహనాలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా రాబోయే మోడళ్లలో పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు కూడా ఉన్నాయి. ఈ కార్లన్నీ రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షల మధ్య ధరల శ్రేణిలో వస్తాయి. సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్, కొత్త టాటా స్కార్లెట్, నెక్ట్స్ జనరేషన్ టాటా నెక్సన్ సహా 3 కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. ఇవి ఈ విభాగంలో మారుతి ఫ్రాంక్స్, బ్రెజాకు గట్టి పోటీ ఇస్తాయి. మారుతి ఈ రెండు ఎస్‌యూవీలు టాప్ 5 అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఉన్నాయి.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్

2025 నాటి కొత్త టాటా పంచ్ డిజైన్ చాలా వరకు పంచ్ ఈవీ మాదిరిగానే ఉంటుంది. ఇందులో సన్నని హెడ్‌ల్యాంప్‌లు, కొత్త బంపర్లు, కొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ ప్యాటర్న్, కొత్త అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అల్ట్రోజ్ మాదిరిగా రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉండవచ్చని భావిస్తున్నారు. టచ్ కంట్రోల్ ప్యానెల్ కూడా ఇవ్వవచ్చు. ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో మునుపటి మాదిరిగానే 86 bhp పవర్ గల 1.2L పెట్రోల్ ఇంజిన్, 73.4 bhp పవర్ గల సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లు లభిస్తాయి.

టాటా స్కార్లెట్

కోడ్‌నేమ్ స్కార్లెట్ ఉన్న ఈ కొత్త టాటా కాంపాక్ట్ ఎస్‌యూవీ లుక్ బాక్సీగా ఉంటుంది. దీని డిజైన్ సియెరా మాదిరిగా ఉంటుంది. ఇది మోనోకోక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతుంది. ఇది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో రావచ్చు. అధికారిక ఇంజిన్ వివరాలు ఇంకా తెలియకపోయినా, నెక్సన్ 120 bhp పవర్ గల 1.2L టర్బో పెట్రోల్, కర్వ్ 125 bhp పవర్ గల 1.2L TGDi పెట్రోల్ లేదా కొత్త 1.5L పెట్రోల్ ఇంజిన్ ఇవ్వవచ్చని భావిస్తున్నారు. దీని ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా వస్తుందని చెబుతున్నారు.

కొత్త తరం టాటా నెక్సన్

టాటా తన ప్రముఖ కారు టాటా నెక్సన్ తదుపరి తరం మోడల్‌ను కూడా తీసుకురానుంది. అయితే, ఇది 2027లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న X1 ఆర్కిటెక్చర్ అప్ డేటెడ్ వెర్షన్‌పై తయారు చేయబడుతుంది. కొత్త మోడల్‌లో పెద్ద డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. 2027 నెక్సన్‌లో పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్‌లు కొనసాగుతాయి.. కానీ బీఎస్7 ఉద్గార నియమాల కారణంగా డీజిల్ ఇంజిన్‌ను నిలిపివేయవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story