Tata Nexon : ఏకంగా రూ.50,000 తగ్గింపు..5-స్టార్ సేఫ్టీ ఎస్‌యూవీపై అదిరిపోయే డీల్
5-స్టార్ సేఫ్టీ ఎస్‌యూవీపై అదిరిపోయే డీల్

Tata Nexon : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన టాటా నెక్సాన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్లతో లభిస్తోంది. కొత్త కారు కొనాలనుకునే వారికి ఈ జనవరి నెల నిజంగానే ఒక మంచి అవకాశం. టాటా మోటార్స్ ఈ నెలలో నెక్సాన్‌పై గరిష్టంగా రూ. 50,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. దీంతో ఈ కారు ప్రారంభ ధర ప్రస్తుతం రూ.7.31 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద చాలా ఆకర్షణీయంగా మారింది.
ఈ రూ.50,000 ప్రయోజనాల్లో నగదు తగ్గింపు, పాత కారును మార్చుకునే వారికి ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బోనస్, ఇప్పటికే టాటా కార్లు వాడుతున్న వారికి లాయల్టీ బెనిఫిట్స్ కలగలిపి ఉన్నాయి. అయితే ఈ ఆఫర్ మీరు ఎంచుకునే వేరియంట్, నగరం, డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు.
టాటా నెక్సాన్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది దాని 5-స్టార్ సేఫ్టీ రేటింగ్. గ్లోబల్ NCAP, భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో పూర్తి మార్కులు సాధించిన అతికొద్ది భారతీయ కార్లలో ఇది ఒకటి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో ప్రామాణికంగా లభిస్తాయి. అందుకే దీనిని రోడ్లపై నడిచే ఇనుప కోట(Iron SUV) అని పిలుస్తుంటారు.
నెక్సాన్ కేవలం సేఫ్టీ మాత్రమే కాదు, టెక్నాలజీలోనూ ముందుంటుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ (EV) వెర్షన్లలో అందుబాటులో ఉండటం కస్టమర్లకు పెద్ద ప్లస్ పాయింట్.

