Tata Nexon : బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇప్పుడు మరింత చవక.. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈఎంఐ ప్లాన్ ఇదే
జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈఎంఐ ప్లాన్ ఇదే

Tata Nexon : టాటా నెక్సాన్ భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటి. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈ కారును కొనుగోలు చేయడం మరింత చవకగా మారింది. ఈ దీపావళికి మీరు టాటా నెక్సాన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. కారు ఫైనాన్స్ ప్లాన్ వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
జీఎస్టీ తగ్గింపు తర్వాత టాటా నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.32 లక్షల నుంచి మొదలై, టాప్ మోడల్ వరకు రూ.14.05 లక్షల వరకు ఉంది. ఉదాహరణకు నెక్సాన్ బేస్ మోడల్‌ను కొనుగోలు చేస్తే, దీనికి ఆన్-రోడ్ ధరగా దాదాపు రూ.8.33 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ధర తగ్గడం వల్ల మధ్యతరగతి కొనుగోలుదారులు కూడా ఎస్‌యూవీ సొంతం చేసుకునేందుకు ఇది మంచి అవకాశం.
మీరు టాటా నెక్సాన్ బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, కనీసం రూ.లక్ష డౌన్ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మిగిలిన రూ.7.33 లక్షలు కారు లోన్ కింద బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. ఈ లోన్ 5 సంవత్సరాల కాలానికి 9% వార్షిక వడ్డీ రేటుతో లభించినట్లయితే, మీరు నెలకు సుమారు రూ.15,000 ఈఎంఐగా చెల్లించాల్సి వస్తుంది.
టాటా నెక్సాన్ కారు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ కారులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు రెండూ ఉన్నాయి. టాటా నెక్సాన్ భారత మార్కెట్‌లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి బ్రెజా, మహీంద్రా XUV300, నిస్సాన్ మాగ్నైట్, మారుతి ఫ్రాంక్స్ వంటి ప్రముఖ కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. ఇవన్నీ వేర్వేరు ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్లు, ధరలతో అందుబాటులో ఉన్నాయి.
