సరికొత్త బ్యాటరీ ప్యాక్‌తో టాటా పంచ్ ఈవీ సంచలనం

Tata Punch EV : టాటా మోటార్స్ తన పాపులర్ ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ పంచ్ ఈవీని సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఫిబ్రవరి 20, 2026న విడుదల కానున్న ఈ 2026 పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇప్పటికే రోడ్లపై ఎలాంటి ముసుగు లేకుండా టెస్టింగ్ చేస్తూ కనిపించింది. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో జరిగిన మార్పులు కేవలం పైన కనిపించేవే కాదు.. టెక్నాలజీ పరంగా కూడా భారీ అప్‌గ్రేడ్స్ జరిగాయి. 2026 పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు మరింత క్లీన్, ఫ్యూచరిస్టిక్ లుక్‌ను సంతరించుకుంది. పాత మోడల్‌లో హెడ్‌లైట్లను కలిపే నల్లటి ప్లాస్టిక్ స్ట్రిప్‌ను కంపెనీ తొలగించింది. దీనివల్ల ముందు భాగం ఇప్పుడు చాలా సింపుల్‌గా, ప్రీమియంగా కనిపిస్తోంది. కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, ఎయిర్ డ్యామ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ దీనికి మరింత మాస్ లుక్‌ను ఇస్తున్నాయి. వెనుక వైపున పెట్రోల్ పంచ్‌లో ఉన్నట్లే కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్ బార్ రావడం విశేషం.

ఈసారి టాటా కేవలం లుక్ మాత్రమే కాదు, టెక్నాలజీలోనూ భారీ మార్పులు చేసింది. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)ను పరిచయం చేస్తోంది. నెక్సాన్ ఈవీ తరహాలోనే ఇందులో 12.3 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్, 10.25 ఇంచుల డిజిటల్ క్లస్టర్ ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, వెంట్ిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఈ కారును మరింత స్పెషల్‌గా మారుస్తున్నాయి. హారియర్ లో ఉండే సన్‌లిట్ ఎల్లో రంగుతో పాటు కొత్త బ్రౌన్ కలర్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి.

పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న 25kWh, 35kWh బ్యాటరీ ఆప్షన్లతో పాటు, కొత్తగా 40.5kWh బ్యాటరీ ప్యాక్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 25kWh బ్యాటరీతో 265 - 315 కి.మీ రేంజ్, 35kWh బ్యాటరీతో 365 - 421 కి.మీ రేంజ్ వస్తుంది. ఒకవేళ 40.5kWh బ్యాటరీ వస్తే, సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 450 కి.మీ నుంచి 500 కి.మీ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story