సిటీ రోడ్లపై ఏది బాస్ ? ఫీచర్లు, రేంజ్ ఇవే

Punch EV vs MG Comet : భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. ముఖ్యంగా సిటీలో తిరగడానికి సౌకర్యంగా ఉండే కార్ల కోసం జనం ఎగబడుతున్నారు. ఈ రేసులో టాటా మోటార్స్ తన ఫేవరెట్ పంచ్ EVని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మరింత పవర్‌ఫుల్‌గా మార్చగా, ఎంజీ కంపెనీ తన కామెట్ EVతో డిజిటల్ లుక్‌ను అందిస్తోంది. ఒకరు SUV లుక్‌తో అదరగొడుతుంటే, మరొకరు మినీ కారులా స్మార్ట్‌గా కనిపిస్తున్నారు. ఈ రెండు కార్ల మధ్య అసలు పోరు ఎక్కడ ఉందో చూద్దాం.

ముందుగా ధర విషయానికి వస్తే, రెండూ కూడా వినియోగదారులను ఆకర్షించేలా బ్యాటరీ అద్దె (BaaS) స్కీమ్‌ను ప్రకటించాయి. ఈ స్కీమ్ కింద ఎంజీ కామెట్ కేవలం రూ.4.99 లక్షలకే లభిస్తుండగా, టాటా పంచ్ EV రూ.6.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. MG బ్యాటరీ అద్దెగా కిలోమీటరుకు రూ.3.2 వసూలు చేస్తుంటే, టాటా కేవలం రూ.2.6 మాత్రమే అడుగుతోంది. అంటే కారు కొనేటప్పుడు కోమెట్ చవకగా అనిపించినా, లాంగ్ రన్‌లో పంచ్ ఈవీ లాభసాటిగా కనిపిస్తుంది.

ఫీచర్ల విషయంలో టాటా పంచ్ ఈవీ ఒక అడుగు ముందే ఉంది. ఇందులో వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. అదే సమయంలో ఎంజీ కామెట్ తన స్మార్ట్ డిజైన్‌తో యువతను ఆకర్షిస్తోంది. కోమెట్‌లో ఇల్యూమినేటెడ్ లోగో, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి వెరైటీ ఫీచర్లు ఉన్నప్పటికీ, సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగులు ఇచ్చి టాటా పంచ్ ఈవీ గట్టి భరోసా ఇస్తోంది. వర్షం పడితే ఆటోమేటిక్‌గా పనిచేసే వైపర్లు కూడా పంచ్‌లో స్పెషల్ అట్రాక్షన్.

ఇక పవర్, రేంజ్ విషయానికి వస్తే.. పంచ్ ఈవీ అసలైన బాహుబలి అని చెప్పాలి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 468 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. హైవేలపై వెళ్లాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. అదే ఎంజీ కామెట్ 230 కిలోమీటర్ల రేంజ్‌తో కేవలం సిటీ ప్రయాణాలకే పరిమితం అవుతుంది. ఛార్జింగ్ పరంగా కూడా పంచ్ ఈవీకి DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, కానీ కోమెట్‌కు ఆ సదుపాయం లేదు. కేవలం సిటీలోనే చిన్న గల్లీల్లో కూడా తిరగాలనుకునే వారికి కామెట్ బాగుంటుంది, కానీ ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్స్ వేయాలనుకునే వారికి మాత్రం పంచ్ ఈవీ పక్కా ఛాయిస్.

PolitEnt Media

PolitEnt Media

Next Story