Tata Punch EV : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన టాటా పంచ్ ఈవీ ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువవుతోంది. మీరు ఈ నెలలో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, టాటా మోటార్స్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఏకంగా రూ.1.20 లక్షల వరకు తగ్గింపుతో పాటు మరెన్నో ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకుని, పర్యావరణహితంగా ప్రయాణించాలనుకునే వారికి ఇది సరైన సమయం. టాటా మోటార్స్ ఈ నెలలో పంచ్ ఈవీపై మొత్తం రూ. 1.20 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ఉచిత హోమ్ ఛార్జర్ ఇన్‌స్టాలేషన్, 6 నెలల పాటు ఉచిత ఫాస్ట్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఎంపిక చేసిన కస్టమర్ల కోసం ప్రత్యేక రివార్డ్ ప్రోగ్రామ్ ద్వారా రూ. 1.86 లక్షల వరకు అదనపు లాభాలను పొందే అవకాశం కల్పిస్తోంది. ఫైనాన్స్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీరో డౌన్ పేమెంట్, 100 శాతం ఆన్-రోడ్ ఫండింగ్ సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తోంది.

టాటా పంచ్ ఈవీని మరింత చౌకగా అందించడానికి కంపెనీ BaaS (Battery-as-a-Service) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద కారును కేవలం రూ. 6.49 లక్షల (ప్రారంభ ధర)కే కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీ కోసం మాత్రం మీరు వాడే కిలోమీటర్లను బట్టి చెల్లించాల్సి ఉంటుంది. ఒక కిలోమీటర్‌కు సుమారు రూ. 2.60 ఖర్చవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. దీనివల్ల కారు కొనేటప్పుడు పెట్టే భారీ పెట్టుబడి భారం తగ్గుతుంది.

రేంజ్, పెర్ఫార్మెన్స్

కొత్త పంచ్ ఈవీ ఐదు వేరియంట్లలో (స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+) లభిస్తోంది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి:

30kWh బ్యాటరీ: ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 365 కి.మీ రేంజ్ ఇస్తుంది. దీని మోటార్ 88hp పవర్‌ను జనరేట్ చేస్తుంది.

40kWh బ్యాటరీ: ఇది ఏకంగా 468 కి.మీ భారీ రేంజ్ ఇస్తుంది. దీని మోటార్ 129hp పవర్‌తో దూసుకుపోతుంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే, కేవలం 15 నిమిషాల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వందల కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా పవర్ వస్తుంది.

డిజైన్, ఫీచర్లు

కొత్త పంచ్ ఈవీ డిజైన్ పరంగా చాలా షార్ప్‌గా కనిపిస్తుంది. ఇటీవల వచ్చిన ఐసీఈ (పెట్రోల్) మోడల్ ఫేస్‌లిఫ్ట్ ప్రేరణతో దీనిని రూపొందించారు. లోపల విశాలమైన క్యాబిన్, అప్‌డేటెడ్ టెక్నాలజీ ఫీచర్లతో ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఎస్‌యూవీగా ఇది నిలుస్తుంది. భవిష్యత్తులో టాటా సియెర్రా ఈవీ కూడా రాబోతున్న తరుణంలో, పంచ్ ఈవీకి లభిస్తున్న ఈ ఆదరణ టాటా మోటార్స్ జోరును మరింత పెంచుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story