Tata Punch : టాటా పంచ్ లో నెన్సాన్ పవర్..బడ్జెట్ ఎస్‌యూవీల్లో ఇక దీనిదే హవా!
బడ్జెట్ ఎస్‌యూవీల్లో ఇక దీనిదే హవా!

Tata Punch : టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో ఎస్‌యూవీ పంచ్‌ను సరికొత్త హంగులతో సిద్ధం చేసింది. 2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను జనవరి 13న అధికారికంగా లాంచ్ చేయబోతోంది. లాంచ్‌కు ముందే ఈ కారుకు సంబంధించిన ఫోటోలు, ఫీచర్లు లీక్ అవ్వడమే కాకుండా, నెన్సాన్ ఇంజిన్‌తో ఇది వస్తుండటం ఇప్పుడు ఆటోమొబైల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
కొత్త పంచ్‌లో అతిపెద్ద మార్పు దాని ఇంజిన్. ఇప్పటివరకు కేవలం సాధారణ పెట్రోల్ ఇంజిన్‌తోనే ఉన్న పంచ్, ఇప్పుడు టాటా నెన్సాన్ నుంచి తీసుకున్న 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో రాబోతోంది. ఇది 118 bhp పవర్, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. దీనివల్ల హైవేలపై పంచ్ పనితీరు అద్భుతంగా ఉండబోతోంది. సాధారణ 1.2L పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్లు కూడా యధావిధిగా అందుబాటులో ఉంటాయి.
ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కావడంతో దీని ఎక్స్‌టీరియర్‌లో భారీ మార్పులు చేశారు. పంచ్ ఈవీని పోలి ఉండేలా.. పల్చని LED డే-టైమ్ రన్నింగ్ లైట్లు, కొత్త బ్లాక్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్ దీనికి కొత్త రూపునిచ్చాయి. హెడ్‌ల్యాంప్స్ ఇప్పుడు మరింత షార్ప్‌గా ఉన్నాయి. వెనుక వైపు కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్ మరియు కొత్త 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తున్నాయి.
కారు లోపల అడుగుపెడితే మీకు లగ్జరీ ఫీలింగ్ కలుగుతుంది. నెన్సాన్, హారియర్ తరహాలో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ (మధ్యలో వెలిగే టాటా లోగోతో) అమర్చారు. 10.25-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా 360-డిగ్రీ కెమెరాను పరిచయం చేస్తున్నారు. దీనివల్ల ఇరుకైన సందుల్లో కారును పార్క్ చేయడం చాలా ఈజీ అవుతుంది.
సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. టాటా కార్లంటేనే సేఫ్టీకి మారుపేరు. కొత్త పంచ్‌లో ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఇచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఈఎస్‌సీ (ESC), ఏబీఎస్ విత్ ఈబీడీ (ABS+EBD), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు దీనికి 5-స్టార్ సేఫ్టీని కొనసాగిస్తాయి.

