ఇక మైక్రో ఎస్‌యూవీల సామ్రాజ్యంలో దీనిదే హవా

Tata Punch : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ ఇప్పుడు సరికొత్త అవతారంలో మెరవడానికి సిద్ధమైంది. టాటా మోటార్స్ ఈ పాపులర్ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జనవరి 13న అధికారికంగా లాంచ్ చేయబోతోంది. ఈసారి కేవలం లుక్స్ మాత్రమే కాదు, సేఫ్టీ, ఫీచర్ల విషయంలో కూడా పంచ్ తన పేరుకు తగ్గట్టుగా ప్రత్యర్థులకు గట్టి పంచ్ ఇవ్వబోతోంది. ముఖ్యంగా ఆరు వేరియంట్లలో రాబోతున్న ఈ కారులో ఏ మోడల్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో కంపెనీ ముందే వెల్లడించింది.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. అవి: స్మార్ట్, ప్యూర్, ప్యూర్+, అడ్వెంచర్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్+ ఎస్. ప్రతి వేరియంట్‌ను కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా విభిన్న ఫీచర్లతో టాటా మోటార్స్ తీర్చిదిద్దింది.

వేరియంట్ల వారీగా ఫీచర్లు ఇవే

స్మార్ట్ : ఇది బేస్ వేరియంట్ అయినప్పటికీ, భద్రతలో రాజీ పడలేదు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, కొత్త స్టీరింగ్ వీల్, ఈకో మరియు సిటీ డ్రైవింగ్ మోడ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు స్టాండర్డుగా వస్తాయి.

ప్యూర్ : ఇందులో వెనుక సీటు ప్రయాణికుల కోసం ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ డీఫాగర్, అడ్జస్టబుల్ డే అండ్ నైట్ ఐఆర్‌విఎమ్ వంటి సౌకర్యాలు అదనంగా ఉంటాయి.

ప్యూర్ ప్లస్ : ఈ వేరియంట్ నుంచి టెక్నాలజీ పెరుగుతుంది. 20.32 సెం.మీ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, రియర్ పార్కింగ్ కెమె, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అడ్వెంచర్ : సాహస ప్రియుల కోసం ఇందులో 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్లను జోడించారు.

అకంప్లిష్డ్ : ఇది మరింత లగ్జరీగా ఉంటుంది. 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, 26.03 సెం.మీ భారీ టచ్‌స్క్రీన్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, ప్రయాణికులకు అదనపు సౌకర్యాన్ని ఇచ్చేలా థై సపోర్ట్ ఉన్న సీట్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణ.

అకంప్లిష్డ్+ ఎస్ : ఇది టాప్ ఎండ్ వేరియంట్. ఇందులో వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, iRA కనెక్టివిటీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్, మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగిస్తున్నారు. అయితే, ఈసారి కస్టమర్లకు ఒక తీపి కబురు ఏంటంటే.. ఇందులో సరికొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా రాబోతోంది. ఇది కారుకు మరింత పవర్, వేగాన్ని అందిస్తుంది. గేర్‌బాక్స్ విషయానికొస్తే మ్యాన్యువల్, ఏఎమ్‌టీ ఆప్షన్లు మునుపటిలాగే అందుబాటులో ఉంటాయి. మైలేజీ విషయంలో కూడా టాటా కొన్ని మెరుగుదలలు చేసినట్లు తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story