ఎంత టోకెన్ అమౌంట్ చెల్లించాలి?

Tata Sierra : టాటా మోటార్స్ కొత్త ఎస్‌యూవీ టాటా సియెర్రా రూ.11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ కొత్త కారు బుకింగ్స్ డిసెంబర్ 16, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. బుకింగ్స్ మొదలైన నెల తర్వాత అంటే జనవరి 15, 2026 నుంచి కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీ డెలివరీలను ప్రారంభించనుంది. అయితే సియెర్రాను బుక్ చేసుకోవడానికి చెల్లించాల్సిన టోకెన్ మొత్తం గురించి కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ బుకింగ్ మొత్తం సుమారు రూ.11,000 నుంచి రూ.51,000 వరకు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

టాటా మోటార్స్ సియెర్రాను ఏకంగా 24 వేరియంట్లలో భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ కారు పెట్రోల్, డీజిల్ అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. అలాగే ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఇచ్చారు. అడ్వాన్సుడ్ ఫీచర్లలో ముఖ్యంగా పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంది. అయితే టాటా కంపెనీ ఈ 24 వేరియంట్ల ధరలను ఇంకా పూర్తిగా ప్రకటించలేదు.

టాటా సియెర్రా మూడు వేర్వేరు ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అత్యంత శక్తివంతమైనది. ఈ ఇంజిన్ 160 PS పవర్‌ను, 255 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ జతచేయబడింది. 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 106 PS పవర్‌ను, 145 Nm టార్క్‌ను అందిస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 118 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇంజిన్‌కు కూడా మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story