ఈ ఏడాదే ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచ్

Tata Sierra EV : భారతీయ రోడ్లపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన టాటా సియెర్రా గుర్తుందా? అదేనండీ.. వెనుక వైపు పెద్ద గ్లాస్ ఏరియాతో రాజసం ఉట్టిపడేలా ఉండే ఆ కారు ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో మళ్లీ రాబోతోంది. 2020 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ మోడల్‌గా కనిపించి అందరినీ ఊరించిన ఈ కారు, ఇప్పుడు ప్రొడక్షన్ దశకు చేరుకుంది. నిజానికి ఇది 2027లో వస్తుందని అనుకున్నారు కానీ, టాటా మోటార్స్ రూట్ మార్చింది. ఈ ఏడాదిలోనే ఈ ఎలక్ట్రిక్ సంచలనాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది.

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఇప్పటికే తిరుగులేని నాయకుడిగా ఉంది. ఇప్పుడు తన పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ సియెర్రా.ఈవీని రంగంలోకి దించుతోంది. ఇది హారియర్ ఈవీ కంటే కొంచెం తక్కువ ధరకు, కర్వ్ ఈవీ కంటే కొంచెం ఎక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. అంటే మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ముఖ్యంగా రాబోయే హ్యుందాయ్ క్రేటా ఈవీ, మహీంద్రా BE6 వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

పాత సియెర్రా కారులో ఉన్న ఐకానిక్ పనోరమిక్ రియర్ గ్లాస్ ఈ కొత్త ఈవీలో కూడా కొనసాగనుంది. అయితే దీని లుక్ ఇప్పుడు మరింత ఫ్యూచరిస్టిక్‌గా మారింది. క్లోజ్డ్ గ్రిల్, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్లతో ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే అందరూ ఆగి చూడాల్సిందే. ఇది పెట్రోల్ వెర్షన్‌లో కూడా రాబోతోంది, కానీ ఈవీ వెర్షన్‌ను గుర్తించేలా కొన్ని ప్రత్యేక మార్పులను టాటా చేసింది.

టాటా సియెర్రా.ఈవీ ఇంటీరియర్ గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులో 360-డిగ్రీల కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా 12 స్పీకర్లతో కూడిన ప్రీమియం JBL ఆడియో సిస్టమ్, డాల్బీ అట్మోస్ సపోర్ట్, హెడ్-అప్ డిస్‌ప్లే, ట్రిపుల్-స్క్రీన్ సెటప్‌ను టాటా అమర్చనుంది. వెనుక సీట్లలో కూర్చునే వారికి సన్ షేడ్స్, వెంటిలేటెడ్ సీట్లు కూడా అందుబాటులో ఉంటాయి. కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో మొబైల్ నుంచే కారును కంట్రోల్ చేయవచ్చు.

ఈ కారు టాటా సరికొత్త ఆర్గోస్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి నిర్మించబడింది. ఇది కేవలం ఈవీల కోసమే కాకుండా వివిధ రకాల ఇంధన ఆప్షన్ల కోసం డిజైన్ చేసిన మల్టీ-ఎనర్జీ ఆర్కిటెక్చర్. సమాచారం ప్రకారం, సియెర్రా.ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్లలో రానుంది. 55 kWh, 65 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే, హారియర్ ఈవీలోని 75 kWh బ్యాటరీని కూడా ఇందులో ఇచ్చే అవకాశం ఉంది. ఈ కారులో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉండటం దీనికి ప్లస్ పాయింట్. అంటే కొండలు, బురద దారుల్లో కూడా ఈ కారు అలవోకగా దూసుకుపోతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story