లక్ష మార్కు దాటిన బుక్కింగ్స్

Tata Sierra : టాటా మోటార్స్ ఐకానిక్ బ్రాండ్ సియెర్రా భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 90వ దశకంలో కుర్రాళ్ల కలల కారుగా ఉన్న సియెర్రా ఇప్పుడు సరికొత్త అవతారంలో వచ్చి రికార్డులను తిరగరాస్తోంది. కేవలం రెండు నెలల్లోనే లక్షకు పైగా బుకింగ్స్ సాధించి, టాటా చరిత్రలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందంటే, ఇప్పుడు ఈ కారును ఇంటికి తీసుకెళ్లాలంటే కనీసం నాలుగు నెలలు ఆగాల్సిందే. టాటా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సరికొత్త సియెర్రా ఎస్‌యూవీ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. 2025 డిసెంబర్‌లో బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 24 గంటల్లోనే 70,000 మంది దీన్ని బుక్ చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సంఖ్య ఇప్పుడు 1,00,000 దాటిందని టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర ధృవీకరించారు. అయితే భారీ డిమాండ్ కారణంగా కారు వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు 4 నెలలకు పైగా పెరిగింది. బుకింగ్స్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండటానికి, కంపెనీ ఇప్పుడు ఉత్పత్తిని భారీగా పెంచడంపై దృష్టి పెట్టింది.

కొత్త జనరేషన్ టాటా సియెర్రా మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

1.5 లీటర్ GDi టర్బో పెట్రోల్: ఇది 158bhp పవర్, 255Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్: ఇది 105bhp పవర్ ఇస్తుంది. దీనిని 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డీసీటీ (DCT) ఆప్షన్లలో తీసుకోవచ్చు.

1.5 లీటర్ డీజిల్ ఇంజిన్: ఇది 116bhp పవర్, 260Nm టార్క్‌ను అందిస్తుంది. లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

కారు లోపలికి అడుగు పెడితే మీరు ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇందులో మొదటిసారిగా ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్ అమర్చారు. 12 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, సౌండ్ బార్, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవల్ 2 ADAS సేఫ్టీ, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. సియెర్రా సిగ్నేచర్ అయిన ఆల్పైన్ రూఫ్‎ను ఇప్పుడు సరికొత్తగా ఫ్లాట్ గ్లాస్, సన్‌రూఫ్‌తో రీ-డిజైన్ చేశారు.

సియెర్రా పొడవు 4.6 మీటర్లు ఉండటంతో రోడ్డుపై చాలా గంభీరంగా కనిపిస్తుంది. 19-అంగుళాల భారీ అల్లాయ్ వీల్స్, ఫుల్ ఎల్‌ఈడీ లైటింగ్ ప్యాకేజీ, బాక్సీ డిజైన్ దీనికి రగ్గడ్ లుక్‌ని ఇస్తున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటివి స్టాండర్డ్‌గా వస్తాయి. 6 రకాల బాహ్య రంగులు, 3 రకాల ఇంటీరియర్ థీమ్స్‌లో ఇది అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ఉన్న ముడి విడిభాగాల కొరతను అధిగమించి, త్వరగా డెలివరీ ఇవ్వడమే టాటా ముందున్న అతిపెద్ద సవాల్.

PolitEnt Media

PolitEnt Media

Next Story