నవంబర్ 25న లాంచ్ కానున్న ఐకానిక్ ఎస్‌యూవీ

Tata Sierra : టాటా మోటార్స్ నుంచి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ ఐకానిక్ టాటా సియెర్రా తిరిగి రాబోతోంది. కొత్త అవతార్‌లో రానున్న ఈ కారు నవంబర్ 25న భారతీయ మార్కెట్‌లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ కారు ఒక కొత్త ఒరవడి సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కొత్త లుక్, అప్డేటెడ్ ఇంజిన్, మొట్టమొదటిసారిగా టాటా కార్లలో రాబోతున్న కొన్ని ప్రత్యేక ఫీచర్లతో వస్తున్న సియెర్రా గురించి పూర్తి వివరాలు, ధర అంచనా, టాప్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

టాటా సియెర్రా పాత మోడల్ ఆకర్షణను కొనసాగిస్తూనే పూర్తిగా కొత్త రూపంలో, టెక్నాలజీతో భారతీయ మార్కెట్లోకి వస్తోంది. టాటా సియెర్రా ఈ నెల నవంబర్ 25న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కారు ధర రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. సియెర్రా దాదాపు 4.3 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఇది టాటా కర్వ్ కంటే పొడవుగా ఉంటుంది..కానీ టాటా హారియర్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. కొత్త మోడల్ అయినప్పటికీ, ఇందులో పాత సియెర్రా క్లాసిక్ లుక్స్‌ను మనం చూడవచ్చు.

సియెర్రాను టాటా మోటార్స్ పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో రిలీజ్ చేయనుంది. సియెర్రా మొదటగా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వెర్షన్‌లో విడుదల కానుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 1.5 లీటర్ టర్బో యూనిట్ ఫ్లాగ్‌షిప్ కింద వస్తుంది. ఆ తర్వాత విడుదలయ్యే సియెర్రా ఈవీ, రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. 55 kWh, 65 kWh. ఈ ఎలక్ట్రిక్ కారు AWD లేదా డ్యూయల్-మోటార్ సెటప్ తో వచ్చే అవకాశం ఉంది.

కొత్త సియెర్రాలో టాటా కార్లలో ఇంతకు ముందెన్నడూ లేని కొన్ని అద్భుతమైన ఫీచర్లను జోడించారు. టాటా కారులో మొట్టమొదటిసారిగా, డాష్‌బోర్డ్‌లో డ్యూయల్-స్క్రీన్ సెటప్ (ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం) అందించారు. ఇందులో అడ్వాన్సుడ్ ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) లెవెల్ 2 ఫీచర్ ఉంటుంది. ఇది సేఫ్టీని బాగా పెంచుతుంది. విలాసవంతమైన ఫీచర్లైన పెద్ద పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అందించారు. టెక్నాలజీకి అనుగుణంగా ఇందులో పవర్‌డ్ హ్యాండ్‌బ్రేక్ (ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్) ఫీచర్ కూడా ఉంది. వెనుక ప్రయాణీకుల కోసం రేర్ సన్‌బ్లైండ్స్, వెనుక సీట్లలో మిడిల్ హెడ్‌రెస్ట్ వంటి సౌకర్యాలు కూడా ఈ కారులో అందుబాటులో ఉంటాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story