3 పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో కొత్త రికార్డు.. మొనగాడు దిగుతున్నాడు

Tata Sierra : సుమారు రెండు దశాబ్దాల తర్వాత టాటా మోటార్స్ ఐకానిక్ కారు టాటా సియెర్రా భారత మార్కెట్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈసారి ఈ కారు సరికొత్త టెక్నాలజీతో, మోడ్రన్ స్టైల్‌లో అడుగుపెట్టనుంది. నవంబర్ 25న న్యూ జనరేషన్ మోడల్‌గా టాటా సియెర్రా గ్రాండ్‌గా లాంచ్ కానుంది. 1991లో లాంచ్ అయినప్పుడు భారతదేశంలోనే తొలి ఆఫ్-రోడర్ ఎస్‌యూవీగా పేరు తెచ్చుకున్న ఈ కారు ఇప్పుడు రెట్రో-ఇన్స్‌పైర్డ్ డిజైన్‌తో కూడిన మోడ్రన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీగా వస్తోంది. ఈ కారు మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌లతో పాటు, ఎలక్ట్రిక్ వేరియంట్‌లో కూడా లభించడం దీని ప్రత్యేకత.

టాటా సియెర్రా ఇంజిన్ పవర్

టాటా సియెర్రా ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) వేరియంట్లు పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్లతో మార్కెట్‌లోకి రానున్నాయి. సియెర్రా పెట్రోల్ వేరియంట్‌లో టాటా కొత్త 1.5-లీటర్ TGDi టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉండవచ్చు. ఈ ఇంజిన్‌ను టాటా ఆటో ఎక్స్‌పో 2023 లో ఆవిష్కరించింది. ఈ డైరెక్ట్ ఇంజెక్షన్ యూనిట్ ద్వారా 5,500 rpm వద్ద 168-170 bhp పవర్‌ను, 2,000-3,000 rpm వద్ద 280 Nm పీక్ టార్క్‌ను పొందవచ్చు.

టాటా సియెర్రా డీజిల్ వేరియంట్‌లో 2.0-లీటర్ క్రాయోటెక్ ఇంజిన్ లభించనుంది. ఈ ఇంజిన్ ద్వారా 168 bhp పవర్‌ను, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయవచ్చు. పెట్రోల్, డీజిల్.. ఈ రెండు వేరియంట్లలోనూ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

టాటా సియెర్రా ఈవీ

సియెర్రా ICE వేరియంట్లతో పాటు, ఎలక్ట్రిక్ అవతార్లో కూడా మార్కెట్‌లోకి రానుంది. టాటా ఈ ఎలక్ట్రిక్ కారు Acti.EV ప్లాట్‌ఫామ్పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫామ్ వేర్వేరు సైజుల బ్యాటరీలను అడ్జస్ట్ చేయగలదు. దీని ద్వారా టాటా ఈ కారులో సింగిల్, డ్యూయల్ మోటారు సెటప్‌ను కూడా అమర్చే అవకాశం ఉంది. ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. సియెర్రా ఈవీ సింగిల్ ఛార్జింగ్‌తో 450 కి.మీ నుంచి 550 కి.మీ వరకు దూరం ప్రయాణించగలుగుతుందని అంచనా.

PolitEnt Media

PolitEnt Media

Next Story