రూ.21,000లకే లగ్జరీ ఎస్యూవీ మీదే

Tata Sierra : టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక SUV మోడల్ టాటా సియెర్రాను నవంబర్ 2025లో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షలుగా ఉంది. ఇతర వేరియంట్ల ధరలు కూడా ఇటీవల ప్రకటించిన తర్వాత కంపెనీ ఇప్పుడు బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తిగల వినియోగదారులు రూ.21,000 టోకెన్ మొత్తంతో ఈ SUVని బుక్ చేసుకోవచ్చు. కంపెనీ త్వరలోనే ఎస్‌యూవీ డెలివరీలను ప్రారంభించనుంది.

టాటా సియెర్రా అత్యంత ప్రీమియం క్యాబిన్‌ను కలిగి ఉంది. ఇంటీరియర్‌లో అతిపెద్ద ఆకర్షణ మూడు స్క్రీన్‌లు.. ఒకటి డ్రైవర్ కోసం, మరో రెండు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఉండటం. దీని ద్వారా కంటెంట్‌ను సులభంగా షేర్ చేయవచ్చు. ఇందులో 4-స్పోక్ స్టీరింగ్ వీల్ (టాటా కర్వ్ మోడల్‌ను పోలి ఉంటుంది) ఉంది. దీనిపై వెలిగే టాటా లోగో, టచ్ కంట్రోల్స్ లభిస్తాయి. 12-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, సెగ్మెంట్‌లో మొదటిసారిగా SonicShaft సౌండ్‌బార్ అందించారు. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, భారతదేశంలోనే అతిపెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, క్యాబిన్‌లో సాఫ్ట్-టచ్ మెటీరియల్, ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్ వాడటం వలన ఇది మోడర్న్, లగ్జరీ లుక్‌ను ఇస్తుంది.

టాటా సియెర్రా డిజైన్ పాత సియెర్రా మోడల్ నుంచి స్ఫూర్తి పొంది, బాక్సీ షేప్లో ఉంటుంది. కానీ దీనికి అనేక కొత్త, హైటెక్ ఫీచర్లు జోడించారు. ముందు భాగంలో గ్లోస్-బ్లాక్ యాక్సెంట్స్‌తో పాటు LED హెడ్‌లైట్స్, DRLs, బ్రాండ్ లోగో, సియెర్రా బ్యాడ్జింగ్ ఉన్నాయి. సియెర్రాకు లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) అందించారు. ఇందులో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, 21 ఫంక్షన్ల ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) వంటివి ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్‌బెల్ట్ ప్రీటెన్షనర్, Isofix చైల్డ్ సీట్ మౌంట్‌లు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే కొత్త 1.5-లీటర్ టర్బో డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్ (160 hp పవర్, 255 Nm టార్క్) 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అలాగే, మెరుగైన మైలేజ్ కోసం 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (106 hp పవర్) కూడా లభిస్తుంది. అలాగే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ (118 hp పవర్) 6-స్పీడ్ మాన్యువల్ (260 Nm టార్క్), 6-స్పీడ్ ఆటోమేటిక్ (280 Nm టార్క్) గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story