టాటా లేటెస్ట్ సెన్సేషన్ బుక్ చేస్కోండి

Tata Sierra : టాటా మోటార్స్ పాత తరం సియెర్రా కారు, కొత్త రూపంలో మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఐకానిక్ ఎస్‌యూవీ కోసం చాలా మంది కస్టమర్‌లు బుకింగ్‌లు ఎప్పుడు మొదలవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారికంగా ఈ ఎస్‌యూవీ బుకింగ్‌లు డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, దీనికి ముందే కంపెనీకి చెందిన కొన్ని డీలర్‌షిప్‌లు అడ్వాన్స్‌గా కారు బుకింగ్‌లు తీసుకోవడం మొదలుపెట్టాయి. ఈ డీలర్‌షిప్‌లు రూ.21,000 టోకెన్ అమౌంట్ తీసుకుని అనధికారికంగా ప్రీ-బుకింగ్‌లు స్వీకరిస్తున్నాయి.

మీరు కొత్త సియెర్రాను బుక్ చేసుకోవాలంటే టాటా మోటార్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, కంపెనీ సైట్ ద్వారా ప్రీ-బుకింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కస్టమర్లు తమ పేరు, ఫోన్ నెంబర్, ఇమెయిల్, పిన్‌కోడ్, రాష్ట్రం, కోరుకునే పవర్‌ట్రెయిన్ (ఇంజిన్) వంటి వివరాలను వెబ్‌సైట్‌లో సమర్పించాలి. ఆ వివరాలను తీసుకున్న తర్వాత, టాటా ప్రతినిధి మిమ్మల్ని సంప్రదించి మీ ఇంటికి దగ్గరలో ఉన్న డీలర్‌షిప్‌తో కనెక్ట్ చేస్తారు.

కొత్త టాటా సియెర్రా మొత్తం 7 వేరియంట్‌లలో లభిస్తుంది. అవి: Smart+, Pure, Pure+, Adventure, Adventure+, Accomplished, Accomplished+. చివరి రెండు వేరియంట్ల ధరలు ఇంకా ప్రకటించనప్పటికీ, మిగిలిన వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ.11.49 లక్షల నుంచి రూ.18.49 లక్షల మధ్య ఉంటాయి. ఈ సియెర్రా ఎస్‌యూవీ డెలివరీలను టాటా మోటార్స్ జనవరి 15 నుంచి కస్టమర్లకు అందించడం మొదలుపెడుతుంది.

టాటా సియెర్రా ఎస్‌యూవీలో మూడు ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

1.5 లీటర్ హైపెరియన్ T-GDi పెట్రోల్ ఇంజన్ (160PS/255Nm), 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

1.5 లీటర్ రెవోట్రాన్ NA పెట్రోల్ ఇంజన్ (106PS/145Nm), 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7 స్పీడ్ DCA ఆటోమేటిక్ ఆప్షన్‌తో లభిస్తుంది.

1.5 లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజన్ (118PS, 260/280Nm), 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో ఎంచుకోవచ్చు.

సియెర్రా ఎంట్రీ ఇచ్చిన సెగ్మెంట్‌లో ఇప్పటికే కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్ వంటి ప్రముఖ మోడల్స్‌తో పాటు, టాటా సొంత మోడల్ టాటా కర్వ్, మహీంద్రా థార్ వంటి మోడల్స్‌తో కూడా ఇది గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story