ఎస్‌యూవీ బాద్‌షా ఎవరు?

Tata Sierra vs Hyundai Creta: భారతదేశ ఎస్‌యూవీ మార్కెట్‌లో ఇప్పుడు అసలైన యుద్ధం మొదలైంది. ఇన్నాళ్లూ తనకంటూ ఎదురులేకుండా సాగిపోతున్న హ్యుందాయ్ క్రెటాకు పోటీగా, టాటా మోటార్స్ తన ఐకానిక్ బ్రాండ్ టాటా సియెర్రాను సరికొత్త హంగులతో బరిలోకి దించింది. పాత కాలపు సియెర్రా జ్ఞాపకాలను నెమరువేస్తూనే, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో వచ్చిన ఈ కారు క్రెటా కోటను బద్దలు కొడుతుందా? ఈ రెండింటిలో ఏది కొంటే లాభం? ధర నుంచి ఫీచర్ల వరకు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బడ్జెట్ విషయానికి వస్తే హ్యుందాయ్ క్రెటా కొంత ఊరటనిస్తుంది. క్రెటా బేస్ మోడల్ ప్రారంభ ధర రూ.10.73 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలుగా ఉంది. అంటే బేస్ మోడల్ పరంగా క్రెటా చౌక. కానీ, టాప్ ఎండ్ వేరియంట్ల విషయానికి వస్తే సీన్ రివర్స్ అవుతుంది. సియెర్రా టాప్ మోడల్ రూ. 18.49 లక్షలు ఉంటే, క్రెటా టాప్ మోడల్ ధర ఏకంగా రూ. 20.20 లక్షల వరకు వెళ్తుంది. ప్రీమియం ఫీచర్లు తక్కువ ధరలో కావాలనుకునే వారికి సియెర్రా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

టాటా సియెర్రా లోపలికి అడుగుపెడితే ఏదో లగ్జరీ కారులో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. ఇందులో ఏకంగా ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఇచ్చారు. ఇది సెగ్మెంట్లోనే హైలైట్. దీనికి పోటీగా క్రెటాలో డ్యూయల్ స్క్రీన్ మాత్రమే ఉంది. ఇక సియెర్రాలో ఉన్న 19-అంగుళాల భారీ అల్లాయ్ వీల్స్, 12 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ కారుకు రాజసాన్ని అద్దాయి. ముఖ్యంగా సీట్ల దగ్గర థై సపోర్ట్ అద్భుతంగా ఉందని టాటా చెబుతోంది. లాంగ్ జర్నీ చేసేవారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.

డిజైన్ పరంగా చూస్తే క్రెటా చాలా మోడ్రన్‌గా, షార్ప్‌గా కనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి సిటీలో తిరగడానికి ఇది బెస్ట్ ఎస్‌యూవీ. మరోవైపు టాటా సియెర్రా డిజైన్ చాలా యూనిక్‌గా ఉంది. పాత సియెర్రా వెనుక వైపు ఉండే ఐకానిక్ గ్లాస్ విండో లుక్ దీనికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. మీరు రోడ్డు మీద వెళ్తుంటే అందరూ ఆగి చూసేలా దీని లుక్ ఉంటుంది. పర్ఫార్మెన్స్, మెయింటెనెన్స్ విషయంలో క్రెటాకు మంచి పేరు ఉంది. అయితే, లేటెస్ట్ టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్స్, అదిరిపోయే లుక్స్ కావాలనుకుంటే మాత్రం టాటా సియెర్రానే బెస్ట్ ఛాయిస్.

PolitEnt Media

PolitEnt Media

Next Story