కారణాలివే

Tata Tigor : భారత మార్కెట్లో టాటా కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. జూలై 2025లో టాటా పంచ్, నెక్సాన్ వంటి ఎస్‌యూవీలకు 10,000 కంటే ఎక్కువ మంది కస్టమర్లు లభించడమే దీనికి నిదర్శనం. అయితే, అదే సమయంలో టాటా ప్రముఖ సెడాన్ అయిన టాటా టిగోర్ అమ్మకాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. గత నెలలో కేవలం 968 మంది మాత్రమే టాటా టిగోర్‌ను కొనుగోలు చేశారు. దీంతో గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 35 శాతం పడిపోయాయి. దీనివల్ల టాటా టిగోర్, టాటా కంపెనీలో అతి తక్కువగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది.

టాటా టిగోర్‌లో కస్టమర్లకు అనేక ఫీచర్లు లభిస్తాయి. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, వెనుక పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం, ఇందులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో కూడిన EBD, వెనుక పార్కింగ్ సెన్సార్లు, బలమైన బాడీ స్ట్రక్చర్‌ను అందించారు. ఈ కారు డిజైన్ కాంపాక్ట్‌గా ఉన్నప్పటికీ, ఇందులో 419 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇది ఈ సెగ్మెంట్‌లో చాలా మంచిది. ఈ ఫీచర్లు కారును బడ్జెట్ ఫ్రెండ్లీ సెడాన్‌గా నిలుపుతాయి.

టాటా టిగోర్‌లో 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 86bhp పవర్, 113Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT (ఆటోమేటిక్) గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. అంతేకాకుండా, కంపెనీ CNG వెర్షన్‌ను కూడా అందిస్తుంది. ఇది మంచి మైలేజ్ ఇస్తుంది. ధర విషయానికొస్తే, టాటా టిగోర్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 6 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్‌లో రూ. 8.50 లక్షల వరకు ఉంటుంది. ఈ ధర వద్ద ఈ కారు అనేక ఫీచర్లను అందిస్తుంది.

ఆటోమొబైల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టాటా టిగోర్ అమ్మకాలు తగ్గడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ప్రధానంగా, కస్టమర్ల అభిరుచి సెడాన్‌ల నుండి ఎస్‌యూవీల వైపు మారుతోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న చిన్న ఎస్‌యూవీల వల్ల సెడాన్‌లకు డిమాండ్ తగ్గుతోంది. దీనికి తోడు, టిగోర్ డిజైన్, ఫీచర్లలో చాలా కాలంగా పెద్దగా మార్పులు జరగలేదు. దీనివల్ల ఇది మార్కెట్లో కొంచెం పాతదిగా కనిపిస్తోంది. ఈ కారణాల వల్ల టిగోర్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story