లుధియానాలో ఫస్ట్ పాప్-అప్ స్టోర్ షురూ

Tesla :పంజాబ్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక సంచలనం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల రంగంలో రారాజుగా వెలుగొందుతున్న టెస్లా, ఇప్పుడు పంజాబ్‌లోని లుధియానాలో తన మొట్టమొదటి పాప్-అప్ స్టోర్‌‎ను ప్రారంభించింది. నగరంలోని ప్రసిద్ధ పవిలియన్ మాల్‌‎లో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. ఈనెల మార్చి 6 నుండి 12 వరకు ఈ స్టోర్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ టెస్లా యొక్క మోస్ట్ పాపులర్ మోడల్ Model Y Premiumను కస్టమర్లు నేరుగా చూడటమే కాకుండా, టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది.

ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ కార్

టెస్లా మోడల్ Y అనేది కేవలం ఒక కారు మాత్రమే కాదు, ఇది ఒక గ్లోబల్ సక్సెస్ స్టోరీ. 2023, 2024, 2025 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో ఇది అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా, యూరప్, చైనా వంటి దేశాల్లో ఈ కారుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీనికి తోడు అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాల్లో కూడా ఇది అత్యుత్తమ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే హైటెక్ కారు లుధియానా వాసులకు చేరువయింది.

మెరుపు వేగంతో ఛార్జింగ్

టెస్లా అనగానే గుర్తొచ్చేది దాని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ. కేవలం 15 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే దాదాపు 267 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా ఈ కారును డిజైన్ చేశారు. అంటే పెట్రోల్ కొట్టించడానికి పట్టే సమయం కంటే తక్కువలోనే మీ కారు లాంగ్ జర్నీకి సిద్ధమవుతుంది. పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, ఇంధన ఖర్చులను భారీగా తగ్గించుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వరం.

ఎక్స్‌చేంజ్ ఆఫర్, ఈఎంఐ వివరాలు

లుధియానా పాప్-అప్ స్టోర్‌లో టెస్లా ఎక్స్‌పర్ట్స్ కారు ఫీచర్లను వివరిస్తారు. మోడల్ Y ప్రీమియం ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.59,89,000 గా ఉంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు టెస్లా ఒక బంపర్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. మీ పాత పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎక్స్‌చేంజ్ చేస్తే ఏకంగా రూ.3 లక్షల వరకు అదనపు బెనిఫిట్ లభిస్తుంది. అలాగే రూ.6 లక్షల డౌన్ పేమెంట్ కట్టి, నెలకు రూ.49,000 ఈఎంఐ తో ఈ కారును సొంతం చేసుకోవచ్చు.

పోటీ ఎవరితో అంటే?

భారత మార్కెట్లో టెస్లా మోడల్ Y ప్రధానంగా మెర్సిడెస్ బెంజ్ EQB, కియా EV6, బీఎండబ్ల్యూ iX1, బివైడి సీలయన్ 7 వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తోంది. లుధియానాలో ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు టెస్ట్ డ్రైవ్‌లు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి గల వారు టెస్లా ఇండియా వెబ్‌సైట్‌లో తమ స్లాట్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story