Tesla Model Y L : టెస్లా మోడల్ వై ఎల్ వచ్చేసింది.. 681 కిలోమీటర్ల మైలేజీతో సరికొత్త రికార్డు
681 కిలోమీటర్ల మైలేజీతో సరికొత్త రికార్డు

Tesla Model Y L : ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న టెస్లా, భారత మార్కెట్లో తన పట్టును పెంచుకునేందుకు మరో సంచలనానికి తెరలేపింది. తన పాపులర్ మోడల్ వైలో సరికొత్త 'L' వేరియంట్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఇది ఒక లాంగ్ వీల్‌బేస్ వెర్షన్ మాత్రమే కాదు, విలాసవంతమైన 6-సీటర్ ఆప్షన్‌తో కూడిన పవర్‌ఫుల్ ఈవీ. కేవలం ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు నాన్‌స్టాప్‌గా వెళ్ళిపోయేంత రేంజ్ దీని సొంతం.
విశాలమైన ఇంటీరియర్
టెస్లా కొత్తగా తీసుకొచ్చిన మోడల్ YL లో ప్రధాన మార్పు దాని వీల్‌బేస్. కారు పొడవు పెరగడం వల్ల లోపల ప్రయాణించే వారికి లెగ్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో 6-సీటర్ లేఅవుట్‌ను ప్రవేశపెట్టారు. రెండో వరుసలో విలాసవంతమైన క్యాప్టెన్ సీట్లు ఉంటాయి. ఇక మొదటి వరుస సీట్లకు థాయ్ ఎక్స్‌టెన్షన్ ఫీచర్ ఇచ్చారు, దీనివల్ల ఎంత దూర ప్రయాణం చేసినా అలసట అనేది అస్సలు ఉండదు.
అసాధారణమైన రేంజ్, పర్ఫార్మెన్స్
టెక్నికల్ పరంగా చూస్తే, ఈ కారు WLTP రేటింగ్ ప్రకారం సింగిల్ ఛార్జ్‌పై 681 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది టెస్లా లైనప్‌లోనే అత్యధికం. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ ఉండటం వల్ల కేవలం 5 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. బురద రోడ్లు లేదా వర్షం పడుతున్న తడి రోడ్లపై కూడా ఈ కారు అత్యంత గ్రిప్‌తో ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 201 కిలోమీటర్లుగా కంపెనీ నిర్ణయించింది.
కలర్ ఆప్షన్లు, ధరల వివరాలు
ఈ కొత్త మోడల్ 19 ఇంచుల మషీనా 2.0 అలాయ్ వీల్స్‌తో వస్తుంది. ఇంటీరియర్ కోసం డెడ్ బ్లాక్ కలర్ స్టాండర్డ్ గా వస్తుంది. కలర్ ఎంపిక విషయానికి వస్తే టెస్లా రకరకాల ఆప్షన్లు ఇస్తోంది:
* స్టెల్త్ గ్రే: ఇది స్టాండర్డ్ కలర్, అదనపు ఖర్చు ఉండదు.
* పర్ల్ వైట్, డైమండ్ బ్లాక్: ఈ రంగుల కోసం రూ.95,000 అదనంగా చెల్లించాలి.
* గ్లేసియర్ బ్లూ, అల్ట్రా రెడ్, కాస్మిక్ సిల్వర్: ఇవి ప్రీమియం కలర్స్, వీటి కోసం రూ.1.85 లక్షలు ఖర్చవుతాయి.
* ఇక టెస్లా ప్రసిద్ధి చెందిన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ కావాలనుకుంటే కస్టమర్లు అదనంగా రూ.6 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది.
భారతదేశంలో ట్రిపుల్ రో ఎస్‌యూవీలకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని టెస్లా ఈ మోడల్‌ను రూపొందించింది. ఇది కేవలం ఒక ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, స్టేటస్ సింబల్‌గా కూడా నిలవనుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కంటిన్యూస్లీ వేరియబుల్ డ్యాంపింగ్ సస్పెన్షన్ సిస్టమ్ వల్ల రోడ్డుపై గుంతలు ఉన్నా ప్రయాణికులకు ఆ కుదుపులు అస్సలు తెలియవు.

