గ్రౌండ్ క్లియరెన్స్‌తో జీప్ రాంగ్లర్ విల్లీస్ విధ్వంసం

Jeep : జీప్ కంపెనీ తన ఐకానిక్ విల్లీస్ మోడల్‌కు నివాళిగా ఈ విల్లీస్ 392 ఎడిషన్‌ను తీసుకొచ్చింది. దీని బాడీపై ఉన్న రెట్రో గ్రాఫిక్స్ చూస్తుంటే పాత మిలిటరీ జీపులు గుర్తుకు వస్తాయి. కానీ దీని లోపల ఉన్న ఇంజిన్ పవర్ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. అమెరికా మార్కెట్‌లో దీని ప్రారంభ ధర 71,990 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.65.2 లక్షలు)గా నిర్ణయించారు. కేవలం అడ్వెంచర్ అంటే ప్రాణం ఇచ్చే వారి కోసమే ఈ కారును ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ఈ ఎస్‌యూవీ గుండెకాయ లాంటి 6.4-లీటర్ Hemi V8 ఇంజిన్ ఏకంగా 470hp పవర్, 637Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంత భారీ కారు అయినప్పటికీ, ఇది కేవలం 6.8 సెకన్లలోనే సున్నా నుంచి 60mph వేగాన్ని అందుకోగలదు. దీని నుంచి వచ్చే ఎగ్జాస్ట్ సౌండ్ వింటేనే ఆఫ్-రోడింగ్ ప్రియులకు పూనకాలు రావడం ఖాయం. ఇందులో ఉన్న టూ-మోడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ద్వారా ఆ గంభీరమైన శబ్దాన్ని మనం ఎంజాయ్ చేయవచ్చు.

సాధారణ కార్లకు, దీనికి ప్రధాన తేడా దీని టైర్లు, ఎత్తు. ఇందులో 35-ఇంచుల BFGoodrich KO2 టైర్లను వాడారు. ఇవి ఎంతటి కఠినమైన దారుల్లోనైనా సులభంగా దూసుకెళ్తాయి. దీని 11.1-ఇంచుల గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల లోతైన నీళ్లలో గానీ, పెద్ద పెద్ద రాళ్ల మీద గానీ కారు అడుగు భాగం తగలకుండా ప్రయాణించవచ్చు. రక్షణ కోసం ముందు, వెనుక స్టీల్ బంపర్లు, రాక్ రైల్స్ కూడా ఇచ్చారు.

బయట రఫ్ అండ్ టఫ్ గా కనిపించినా, లోపల మాత్రం విల్లీస్ 392 చాలా లగ్జరీగా ఉంటుంది. ఇందులో నాపా లెదర్‎తో చేసిన హీటెడ్ సీట్లు ఉన్నాయి. సంగీత ప్రియుల కోసం 9-స్పీకర్ల ఆల్పైన్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ట్రైలర్ టో ప్యాకేజీని ఇందులో స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నారు. ఈసారి గోల్డిలాక్స్ అనే కొత్త ఎల్లో కలర్ ఆప్షన్‌లో కూడా ఈ కారు కస్టమర్లను పలకరించనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story