ఈ మోడళ్లకు డిమాండ్ పెరిగింది

Scooter Sales : ఈ సంవత్సరం ఆటో సెక్టార్‌లోని స్కూటర్ విభాగంలో పెద్ద మార్పు కనిపించింది. సంవత్సరాలుగా అమ్మకాల్లో నంబర్ 1 స్థానంలో ఉన్న హోండా యాక్టివా స్కూటర్ డిమాండ్ తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగం (ఏప్రిల్-సెప్టెంబర్ 2025) లో SIAM ( సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్) గణాంకాల ప్రకారం.. స్కూటర్ కంపెనీలు మొత్తం 37,21,709 యూనిట్లను విక్రయించాయి. ఇది ఏడాదికి 6.42% వృద్ధిని సూచిస్తుంది. గత సంవత్సరం ఇదే సమయంలో 34,97,300 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే వేగంతో అమ్మకాలు కొనసాగితే, ఈ విభాగం మొదటిసారిగా 70 లక్షల యూనిట్ల మార్కును అధిగమించవచ్చు.

పెట్రోల్ స్కూటర్‌లపై జీఎస్‌టీ 2.0 కారణంగా ధరలలో పెద్ద కోత విధించిన తర్వాత, సెప్టెంబర్ 2025లో అమ్మకాలు (7,33,391 యూనిట్లు) గతంలో అక్టోబర్ 2024లో సాధించిన అత్యుత్తమ సంఖ్య (7,21,200 యూనిట్లు) ను 12,191 యూనిట్లతో అధిగమించాయి. ఇప్పుడు అక్టోబర్ 2025లో దీపావళి కూడా వస్తుంది. తగ్గిన జీఎస్‌టీ ప్రభావం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి, ఇది కొత్త రికార్డు నెలగా మారే అవకాశం ఉంది.

చాలా కాలంగా మార్కెట్ లీడర్‌గా ఉన్న హోండాకు చెందిన ప్రధాన మోడళ్లు Activa 110, Activa 125, Dio 110, Dio 125, గత ఆరు నెలల్లో మొత్తం 14.3 లక్షల స్కూటర్లను విక్రయించాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 9% (15.8 లక్షల యూనిట్లు) తగ్గుదల. అంటే 1,44,591 యూనిట్లు తక్కువగా అమ్ముడయ్యాయి. దీని కారణంగా కంపెనీ మార్కెట్ వాటా 45% నుండి 39% కి తగ్గింది. 2024 లో హోండా మొత్తం 28.4 లక్షల స్కూటర్లను విక్రయించింది. అప్పుడు కూడా దాని వాటా 43.33% నుండి 41.50% కి తగ్గింది.

టీవీఎస్కు పెట్రోల్ స్కూటర్ విభాగంలో జూపిటర్, ఎన్ టార్క్, జెస్ట్ వంటి మోడళ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఐక్యూబ్, కొత్త ఆర్భిటర్ ఉన్నాయి. ఈ కంపెనీ ఏప్రిల్-సెప్టెంబర్ 2025 మధ్య మొత్తం 10.8 లక్షల స్కూటర్లను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 27% వృద్ధిని సూచిస్తుంది. అంటే టీవీఎస్ గత సంవత్సరం కంటే 2,26,709 యూనిట్లు ఎక్కువగా విక్రయించింది. ఇప్పుడు కంపెనీ మార్కెట్ వాటా 29% కి పెరిగింది, ఇది గత సంవత్సరం 24% కంటే చాలా ఎక్కువ. ఇది టీవీఎస్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story