లక్షకు పైగా ఆదా చేసే ఛాన్స్

Toyota : టయోటా కారు కొనాలనుకునే వారికి ఇది నిజంగా అదిరిపోయే శుభవార్త. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ ఏప్రిల్ 2026 నెలలో తన పాపులర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. గ్లాంజా నుంచి హైరైడర్ వరకు దాదాపు అన్ని రకాల కార్లపై లక్ష రూపాయలకు పైగా ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాల రూపంలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

1. టయోటా గ్లాంజా

టయోటా నుంచి వస్తున్న ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ వేరియంట్లపై (CNG, AMT మినహా) గరిష్టంగా రూ.69,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ సపోర్ట్, రూ.30,000 లాయల్టీ బోనస్, రూ.4,000 కార్పొరేట్ బెనిఫిట్ ఉన్నాయి. అదనంగా రూ.10,000 విలువైన యాక్సెసరీ కిట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. స్టైలిష్ కార్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

2. టయోటా అర్బన్ క్రూజర్ టైజర్

ఈ కాంపాక్ట్ క్రాస్ఓవర్ సెగ్మెంట్‌లో టైజర్ వేరియంట్లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. టర్బో ఎంటీ ట్రిమ్ వెర్షన్‌పై నగదు, ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్ కలిపి రూ.55,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక నాన్-టర్బో వేరియంట్లపై ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ సపోర్ట్ ద్వారా రూ.45,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. నగరాల్లో తిరగడానికి ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

3. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్

హైరైడర్ మోడల్‌పై ఈ నెలలో అత్యధికంగా ఆఫర్లు ఉన్నాయి. నియో డ్రైవ్, హైబ్రిడ్ మరియు సిఎన్‌జి వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది. ముఖ్యంగా S నియో డ్రైవ్ వేరియంట్‌పై ఏకంగా రూ.1.10 లక్షల వరకు ఆదా చేసే అవకాశం ఉంది. G, V నియో డ్రైవ్ వేరియంట్లపై రూ.1.01 లక్షల వరకు, సిఎన్‌జి వేరియంట్‌పై రూ.1.02 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. మైలేజీ, టెక్నాలజీ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

4. టయోటా హిలక్స్

టయోటా నుంచి వస్తున్న లైఫ్ స్టైల్ పికప్ ట్రక్ హిలక్స్ పై కూడా అదిరిపోయే ఆఫర్లు కొనసాగుతున్నాయి. ఈ కారులోని అన్ని వేరియంట్లపై కలిపి రూ.1.10 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో రూ.80,000 డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్, రూ.30,000 ఎక్స్ఛేంజ్ సపోర్ట్ ఉన్నాయి. ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారికి హిలక్స్ ఒక అద్భుతమైన వాహనం. అయితే, ఈ ఆఫర్లు డీలర్లను బట్టి, పట్టణాన్ని బట్టి మారవచ్చని గమనించాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story