కొత్త ఆన్-రోడ్ ధరల లిస్ట్ ఇదే!

Toyota Fortuner : టాటా, హ్యుందాయ్ వంటి కంపెనీలు కొత్త కార్లను లాంచ్ చేస్తుంటే, టయోటా మాత్రం తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టయోటా ఫార్చ్యూనర్ ధరలను పెంచి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. 2026 ప్రారంభంలో ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో, కంపెనీ తన వాహనాల ధరలను సవరించింది. భారతదేశంలో స్టేటస్ సింబల్‌గా వెలుగొందుతున్న టయోటా ఫార్చ్యూనర్ ఇప్పుడు మరింత ఖరీదైనదిగా మారింది. వేరియంట్‌ను బట్టి కంపెనీ ధరలను రూ.51,000 నుంచి రూ.74,000 వరకు పెంచింది. కేవలం ధరలు పెంచడమే కాకుండా, పరిమిత కాలం పాటు అందుబాటులో ఉన్న లీడర్ ఎడిషన్ వేరియంట్‌లను కూడా టయోటా నిలిపివేసింది. దీనివల్ల ఫార్చ్యూనర్ లైనప్ ఇప్పుడు మరింత ప్రీమియంగా మారింది.

ఫార్చ్యూనర్ ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన పెట్రోల్ మాన్యువల్‌పై కనీసంగా రూ.51,000 పెరిగింది. అత్యంత శక్తివంతమైన GR-S ట్రిమ్ పై గరిష్టంగా రూ.74,000 పెంపును టయోటా అమలు చేసింది. లెజెండర్ మోడళ్లపై కూడా సుమారు రూ.71,000 వరకు ధర పెరిగింది. 4×4 సామర్థ్యం ఉన్న మోడళ్లు ఇప్పుడు గతంలో కంటే రూ. 50 వేలకు పైగా ఎక్కువ ధర పలుకుతున్నాయి.

బేస్ వేరియంట్ (4x2 Petrol MT) ఇదివరకు రూ.33.65 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.34.16 లక్షలకు చేరింది. చీపెస్ట్ ఆటోమేటిక్ (Petrol AT) ధర రూ.36.41 లక్షల నుండి రూ.36.96 లక్షలకు పెరిగింది. టాప్ మోడల్ (GR-S): ఈ పవర్‌ఫుల్ మోడల్ ధర ఇప్పుడు రూ.49.59 లక్షలకు చేరుకుంది. ఎక్స్-షోరూమ్ ధరలకు ఆర్‌టీఓ, ఇన్సూరెన్స్, ఇతర ట్యాక్స్‌లు కలిపితే ఆన్-రోడ్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. బేస్ మోడల్ సుమారు రూ. 39.84 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ (GR-S 4x4 Diesel AT) ధర సుమారు రూ.58.81 లక్షల వరకు ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story