ఈ లగ్జరీ కారుపై ఏకంగా రూ.13.67లక్షల డిస్కౌంట్

Toyota Land Cruiser : ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ టయోటా నుంచి వచ్చిన ల్యాండ్ క్రూయిజర్ 300 మోడల్ అమ్మకాల విషయంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. గత ఆరు నెలల కాలంలో ఈ కారు కేవలం 116 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. మరీ ముఖ్యంగా ఈ ఆరు నెలల్లో మూడు నెలలు ఈ కారు ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. ఈ నేపథ్యంలో అమ్మకాలను పెంచడానికి, లగ్జరీ కార్ల ప్రియులను ఆకర్షించడానికి టయోటా కంపెనీ ఈ అల్ట్రా-లగ్జరీ ఎస్‌యూవీపై ఏకంగా రూ.13.67 లక్షల భారీ ఇయర్‌-ఎండ్ డిస్కౌంట్‌ను ప్రకటించింది.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300పై భారతదేశంలోనే అతిపెద్ద OEM మద్దతుగల డిస్కౌంట్‌ను డిసెంబర్ 2025 లో అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కింద కొనుగోలుదారులు వివిధ రూపాల్లో మొత్తం రూ.13,67,200 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో భాగంగా 5 సంవత్సరాల వారంటీ కింద రూ.5,17,286 విలువైన ప్రయోజనం. ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్ కింద రూ.50,000 వరకు బోనస్, TFS సబ్‌వెన్షన్ (ఫైనాన్స్ మద్దతు) కింద భారీగా రూ.7,50,000 మద్దతు, రెఫరల్ బోనస్ కింద రూ.50,000 వరకు అదనపు ప్రయోజనం లభిస్తున్నాయి.

డిస్కౌంట్లతో పాటు, టయోటా ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరలను (GST 2.0 ప్రకారం) గణనీయంగా తగ్గించింది. ZX వేరియంట్ పాత ధర రూ.2,31,00,000 కాగా, కొత్త ధర రూ.2,15,60,000. అంటే, ధరలో ఏకంగా రూ.15,40,000 తగ్గింపు వచ్చింది. GR S వేరియంట్ పాత ధర రూ.2,41,00,000 కాగా, కొత్త ధర రూ.2,24,93,300. ఈ వేరియంట్‌లో రూ.16,06,700 తగ్గింపు లభించింది.

ఆటో ఎక్స్‌పో 2023 లో లాంచ్ అయిన ల్యాండ్ క్రూయిజర్ 300 లగ్జరీకి, పటిష్టతకు మారుపేరు. ఇందులో బ్లాక్-అవుట్ గ్రిల్, మస్క్యులర్ హుడ్, గుండ్రటి హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ ఫాగ్ లైట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో సిల్వర్ డిజైన్, వుడెన్ డాష్‌బోర్డ్, రెట్రో ల్యాండ్ క్రూయిజర్ లోగో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ రెండు శక్తివంతమైన ట్విన్ టర్బో V6 డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఒకటి 3.5-లీటర్ ఇంజిన్, ఇది 415ps శక్తిని ఇస్తుంది. మరొకటి 3.3-లీటర్ ఇంజిన్, ఇది 309ps శక్తిని, 700Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ కోసం, ఈ రెండు ఇంజిన్‌లను 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story