అర్బన్ క్రూయిజర్ బీఈవీ లాంచ్, ఫీచర్లు ఇవే

Toyota : ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, టయోటా ఈవీ మార్కెట్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవడం ప్రారంభించింది. ఇండోనేషియాలోని GJAW 2025 ఆటో షోలో టయోటా రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ప్రదర్శించింది.. అవి Toyota bZ4X, అర్బన్ క్రూయిజర్ BEV. ముఖ్యంగా అర్బన్ క్రూయిజర్ BEV భారతదేశానికి చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇది టయోటా నుంచి మన దేశంలో విడుదల కానున్న మొదటి పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కానుంది. దీనిని 2026 మొదటి భాగంలో లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల స్పెసిఫికేషన్లు, ధరల విషయానికి వస్తే.. అర్బన్ క్రూయిజర్ BEV మోడల్‌కు 61.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 426.7 కి.మీ రేంజ్‌ను ఇవ్వగలదు. దీని శక్తి 172 hp. ఇండోనేషియాలో దీని ధర IDR 759 మిలియన్లు (సుమారు రూ.40.78 లక్షలు)గా నిర్ణయించారు. భారత మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ఇది మరింత సరసమైన ధరలో రానుంది.

టయోటా bZ4X: మోడల్‌లో 73.11 kWh పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఇది 525 కి.మీ రేంజ్‌ను, 221 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు దీనిని ఇండోనేషియాలోనే అసెంబుల్ చేస్తున్నారు. దీని కొత్త ధర IDR 799 మిలియన్లు (సుమారు రూ.42.93 లక్షలు)గా ఉంది.

భారత మార్కెట్‌పై ప్రభావంఈ రెండు ఎస్‌యూవీలలో టయోటా T Intouch కనెక్టివిటీ సిస్టమ్ ఉంది. దీని ద్వారా కారు లొకేషన్, స్టేటస్ వంటి వివరాలను స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. bZ4X లో ఆన్‌బోర్డ్ వై-ఫై, రిమోట్ ఇమ్మొబిలైజర్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. భారతదేశంలో అర్బన్ క్రూయిజర్ BEVను మారుతి సుజుకి ఈ-విటారాతో పాటు ఒకే Heartect-e ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేయనున్నారు. 2026 మొదటి భాగంలో భారత మార్కెట్‌లో లాంచ్ కానున్న ఈ ఎస్‌యూవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా కర్వ్ ఈవీ, మారుతి ఈవీఎక్స్ వంటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story