Toyota : భారత ఆటోమొబైల్ మార్కెట్లో నమ్మకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే టయోటా సంస్థ సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది. దేశంలో పెద్ద ఫ్యామిలీ కార్లకు, ఎస్‌యూవీలకు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ త్వరలోనే రెండు పవర్‌ఫుల్ 7-సీటర్ ఎస్‌యూవీలను లాంచ్ చేయబోతోంది. అవే టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ 7-సీటర్, నెక్స్ట్ జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్. ప్రస్తుతం ఈ రెండు కార్ల టెస్టింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్లపై టెస్టింగ్ చేస్తున్న సమయంలో కనిపించిన కొన్ని స్పై షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కార్ల లవర్స్‌లో ఎగ్జైట్‌మెంట్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు, గంభీరమైన లుక్స్‌తో రాబోతున్న ఈ రెండు రాబోయే ఎస్‌యూవీల వివరాలు చూద్దాం.

1. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ 7-సీటర్

భారత మార్కెట్లో ఇప్పటికే మంచి సక్సెస్ అందుకున్న తన పాపులర్ మోడల్ అర్బన్ క్రూజర్ హైరైడర్‌ను ఇప్పుడు సరికొత్త 7-సీటర్ వెర్షన్‌లో తీసుకురావడానికి టయోటా ప్లాన్ చేస్తోంది. ఇదొక పర్ఫెక్ట్ లగ్జరీ ఫ్యామిలీ ఎస్‌యూవీగా మారబోతోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో వచ్చే పండుగల సీజన్ నాటికి ఈ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. టెస్టింగ్ సమయంలో కనిపించిన వివరాల ప్రకారం.. ఈ సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ సాధారణ మోడల్ కంటే పొడవైన రేర్ ఓవర్‌హాంగ్, స్ట్రెచ్డ్ సైడ్ ప్రొఫైల్‌తో చాలా పెద్దదిగా కనిపించనుంది.

ఈ కొత్త 7-సీటర్ కారులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండవు, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హైరైడర్ ఇంజన్ ఆప్షన్లనే ఇందులోనూ కొనసాగిస్తారు. ఇందులో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది 103 బీహెచ్‌పీ (BHP) పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇది కాకుండా మరో పవర్‌ఫుల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ సెటప్ కూడా అందుబాటులో ఉంటుంది, ఇది గరిష్టంగా 116 బీహెచ్‌పీ పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారును ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ ఆప్షన్‌తో కూడా కంపెనీ ఆఫర్ చేయబోతోంది. మార్కెట్లో ఈ లగ్జరీ కారు ధర సుమారు రూ. 16 లక్షల నుంచి రూ. 24 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.

2. నెక్స్ట్ జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్

భారతదేశంలో ఎస్‌యూవీల రారాజుగా వెలుగొందుతున్న టయోటా ఫార్చ్యూనర్ సరికొత్త అవతారంలో మెరిసిపోవడానికి రెడీ అవుతోంది. ఈ న్యూ జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్ గ్లోబల్ లాంచ్ 2026 మధ్యలో అయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా లాంచ్ అయిన తర్వాత.. 2026 చివరి నాటికి ఈ కారు ఇండియన్ మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. కంప్లీట్ లగ్జరీ లుక్‌తో రాబోతున్న ఈ సరికొత్త ఫార్చ్యూనర్ మోడల్ ధర భారత మార్కెట్లో రూ. 36 లక్షల నుంచి రూ. 55...లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

ఈ సరికొత్త ఫార్చ్యూనర్ కారును అప్‌డేట్ చేసిన సరికొత్త ఐఎమ్‌వీ లాడర్-ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. దీని బాడీ స్ట్రక్చర్, లుక్ చాలా వరకు టయోటా నెక్స్ట్ జనరేషన్ హైలక్స్ పిక్‌అప్ ట్రక్కును పోలి ఉంటుంది. ఈ కారు వెనుక భాగంలో సరికొత్త ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు, కనెక్టెడ్ లైట్ బార్, రీడిజైన్ చేసిన బంపర్ హైలైట్‌గా నిలుస్తాయి. ఇక ఫ్రంట్ లుక్ విషయానికి వస్తే.. మునుపటి కంటే చాలా షార్ప్‌గా ఉండే ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, భారీ సైజ్ ఫ్రంట్ గ్రిల్, అగ్రెసివ్ బంపర్ డిజైన్‌తో ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే ఎవరైనా సరే తిరిగి చూడాల్సిందే!

న్యూ జనరేషన్ ఫార్చ్యూనర్ ఇంటీరియర్ భారీ మార్పులతో కంప్లీట్ లగ్జరీగా ఉండబోతోంది. ఇందులో కస్టమర్లను ఆకట్టుకోవడానికి 12.3 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, అత్యంత సురక్షితమైన అడాస్ (ADAS) ఫీచర్లు, ఓటీఏ (OTA) అప్‌డేట్లు, అప్‌డేటెడ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లు ఉండనున్నాయి. ఈ కారు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ప్రస్తుత మోడల్ లాగే ఉన్నప్పటికీ.. ఒకే ఒక ప్రత్యేకమైన మార్పు జరగబోతోంది. కంపెనీ ఈసారి ఈ కారును మరింత మైలేజ్, పవర్ ఇచ్చేలా 48V మైల్డ్-హైబ్రిడ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మార్కెట్లోకి తీసుకురాబోతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story