Toyota : సెలబ్రిలు మెచ్చిన కారు.. ఇది రోడ్డు మీద వెళ్తుంటే అందరి చూపు మీమీదే
ఇది రోడ్డు మీద వెళ్తుంటే అందరి చూపు మీమీదే

Toyota : టయోటా కార్లు అంటేనే క్వాలిటీకి మారుపేరు. కర్ణాటకలోని బిడదిలో ఉన్న టయోటా అతిపెద్ద తయారీ కేంద్రం నుంచి వస్తున్న కార్లకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. గత జూలై నెలలో టయోటా మొత్తం 32,575 యూనిట్లను అమ్మింది. గతేడాది ఇదే నెలలో నమోదైన 31,656 యూనిట్లతో పోలిస్తే ఇది 3 శాతం వృద్ధిని సూచిస్తుంది.
ఆటోమొబైల్ మార్కెట్‌లో గత జూలై నెల పెద్దగా ఆశాజనకంగా లేనప్పటికీ టయోటా కిర్లోస్కర్ మోటార్ మాత్రం అద్భుతమైన పనితీరు చూపింది. గత నెలలో కంపెనీ మొత్తం 32,575 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 31,656 యూనిట్లతో పోలిస్తే, ఇది 3% వృద్ధిని సూచిస్తుంది. వీటిలో దేశీయంగా 29,159 యూనిట్లు అమ్ముడయ్యాయి. అలాగే, 3,416 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేశారు.
టయోటా అమ్మకాల్లో బాగా రాణించిన మోడల్స్‌లో గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైసర్, రూమియన్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, హిలక్స్, ఫార్చ్యూనర్, లెజెండర్, క్యామ్రీ, వెల్ఫైర్, ల్యాండ్ క్రూయిజర్ 300 వంటి మోడళ్లు ఉన్నాయి. టయోటా తన కార్ల భద్రత, ఫీచర్లను మెరుగుపరచడంపై దృష్టి సారించింది.
ఇన్నోవా హైక్రాస్ కారుకు భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. టయోటా గ్లాంజా అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇప్పుడు స్టాండర్డ్‌గా అందుబాటులో ఉన్నాయి. టయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కోసం విడుదల చేసిన ఎక్స్‌క్లూజివ్ లిమిటెడ్ ఎడిషన్ ప్యాకేజీలకు కూడా మార్కెట్లో మంచి స్పందన లభించింది.
