అద్భుతమైన డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్‌తో కొత్త బైక్

Triumph Thruxton 400 : భారతదేశ మార్కెట్‌లో క్యాఫ్ రేసర్ బైక్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ట్రయంఫ్ మోటార్స్ ఒక కొత్త బైక్‌ను లాంచ్ చేయనుంది. అదే ట్రయంఫ్ థ్రక్స్‌టన్ 400. ఇది ఆగస్టు 6న భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల కానుంది. ఇది ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ తర్వాత ట్రయంఫ్ 400సీసీ ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న మూడవ బైక్ ఇది. ట్రయంఫ్ థ్రక్స్‌టన్ 400 మార్కెట్‌లోకి రాగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ గురిల్లా 450 వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ట్రయంఫ్, బజాజ్ ఆటో సహకారంతో ఈ బైక్‌ను తయారు చేసింది. ఇది కేఫ్ రేసర్ సెగ్మెంట్‌లో బైక్ లవర్స్‌కు ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.

థ్రక్స్‌టన్ 400లో కూడా స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400ఎక్స్‌లో ఉన్నటువంటి 398సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌నే ఉపయోగించారు. ఈ ఇంజిన్ 39.5 bhp పవర్, 37.5 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో జతచేయబడింది. అయితే, థ్రక్స్‌టన్ స్పోర్టీ పెర్ఫార్మెన్స్ కోసం ఇంజిన్‌ను కొంచెం రీ-ట్యూన్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ. 2.40 లక్షలు, స్క్రాంబ్లర్ 400ఎక్స్ ధర రూ. 2.65 లక్షలుగా ఉంది. థ్రక్స్‌టన్ 400 ప్రీమియం డిజైన్, పొజిషనింగ్‌ను బట్టి దీని ధర సుమారు రూ. 2.80 లక్షల వరకు ఉండవచ్చు. ఇది ట్రయంఫ్ 400సీసీ రేంజ్‌లో అత్యంత ఖరీదైన బైక్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ బైక్ డిజైన్ చాలా స్టైలిష్‌గా, రెట్రో లుక్‌తో అద్భుతంగా ఉంటుంది. ఫ్రంట్ ఫెయిరింగ్, సర్క్యూలర్ LED హెడ్‌లైట్, క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, వెనుక వైపు ఉన్న ఫుట్ పెగ్స్.. ఇవన్నీ థ్రక్స్‌టన్‌కు ఒక స్పోర్టీ లుక్‌ను తీసుకొస్తాయి. ఇది కేఫ్ రేసర్ బైక్స్‌కు అవసరమైన స్టైల్‌ను అందిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో దీని స్పై ఫోటోలు చూసిన బైక్ లవర్స్ ఈ బైక్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story