టాప్-10లో ఎంట్రీ

TVS iQube : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగంగా పుంజుకుంటోంది. దీనికి నిదర్శనమే డిసెంబర్ 2025 టూ వీలర్ వెహికల్స్ అమ్మకాల గణాంకాలు. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 మోడళ్లలో టీవీఎస్ ఐక్యూబ్ చోటు సంపాదించింది. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన కొనుగోలు శక్తి, పట్టణాల్లో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల మక్కువ పెరగడం వల్ల ఐక్యూబ్ అమ్మకాలు ఏకంగా 75% పైగా పెరిగాయి. ఈ జాబితాలో నిలిచిన ఏకైక ఎలక్ట్రిక్ వాహనం ఇదే కావడం విశేషం.

టీవీఎస్ ఐక్యూబ్ ప్రస్తుతం 6 వేరియంట్లలో, 12 ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. ఆన్-రోడ్ ధరల ప్రకారం..

iQube 2.2 kWh: రూ. 1,15,639

iQube 3.1 kWh: రూ. 1,26,032

iQube 3.5 kWh: రూ. 1,36,686

iQube S 3.5 kWh: రూ. 1,44,456

iQube ST 3.5 kWh: రూ. 1,57,053

iQube ST 5.3 kWh: రూ. 1,72,346

రేంజ్, ఛార్జింగ్

రోజువారీ ప్రయాణాలకు ఐక్యూబ్ ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులోని 4.4kW హబ్-మోటార్ 33Nm టార్క్‌ను అందిస్తుంది. దీనివల్ల వేగంగా దూసుకుపోతుంది. 5.1kWh ST వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 150 కిమీల రియల్ వరల్డ్ రేంజ్ ఇస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, 2.2kWh మోడల్ కేవలం 2 గంటల 45 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుంది. అలాగే హై-ఎండ్ వేరియంట్లు 4 నుంచి 6 గంటల సమయంలో ఫుల్ ఛార్జ్ అవుతాయి. ఏ 15A సాకెట్‌లోనైనా సులభంగా ఛార్జ్ చేసుకునే సౌకర్యం ఉంది.

అత్యాధునిక ఫీచర్లు

టీవీఎస్ ఐక్యూబ్ అంటేనే టెక్నాలజీకి మారుపేరు. ఇందులో ఫుల్ ఎల్‌ఈడీ లైటింగ్, 30 లీటర్ల భారీ అండర్-సీట్ స్టోరేజ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. ప్రధానంగా ఇందులోని స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/ఎస్ఎంఎస్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటివి మీ ఫింగర్ ప్రింట్స్ తోనే ఆపరేట్ చేయవచ్చు. సేఫ్టీ కోసం జియో-ఫెన్సింగ్, క్రాష్, టో అలర్ట్, రివర్స్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story