TVS Apache RTR 160 4V : తక్కువ ధరలోనే టాప్ ఎండ్ ఫీచర్లు.. రోడ్లపై అపాచీ అరాచకం
రోడ్లపై అపాచీ అరాచకం

TVS Apache RTR 160 4V : దేశీయ టూ-వీలర్ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తన మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ బైక్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4విలో సరికొత్త 2026 మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. యువతను విశేషంగా ఆకట్టుకునే ఈ బైక్‌లో ఈసారి కంపెనీ అదిరిపోయే ఫీచర్లను జోడించింది. గతంలో కేవలం ఖరీదైన టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే కనిపించే ప్రీమియం ఫీచర్లను, ఇప్పుడు తక్కువ ధరలో లభించే బేస్ వేరియంట్లలో కూడా అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
ధర ఎంత? ఎక్కడ దొరుకుతుంది?
కొత్త 2026 టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వి ప్రారంభ ధరను కంపెనీ రూ.1,25,440 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ బైక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీవీఎస్ డీలర్‌షిప్‌లలో విక్రయానికి సిద్ధంగా ఉంది. ఈసారి కంపెనీ ఇందులో రెండు కొత్త వేరియంట్లను కూడా ప్రవేశపెట్టింది, తద్వారా కస్టమర్లకు వారి బడ్జెట్ మరియు అవసరాలకు తగ్గట్టుగా ఎంచుకునే అవకాశం లభిస్తుంది.
ఫీచర్ల జాతర.. లైటింగ్ అదిరిపోయింది
కొత్త మోడల్‌లో ప్రధాన మార్పు లైటింగ్ విభాగంలో జరిగింది. ఇప్పుడు ఈ బైక్‌లో అత్యాధునిక ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లు, పూర్తిస్థాయి ఎల్ఈడీ లైటింగ్ సెటప్‌ను అందించారు. సాధారణంగా ఇవి ఖరీదైన బైక్‌లలో మాత్రమే కనిపిస్తాయి. వీటితో పాటు, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఫీచర్‌ను కూడా ఎక్కువ వేరియంట్లలో చేర్చారు. దీనివల్ల ట్రాఫిక్‌లో క్లచ్ నొక్కడం చాలా తేలికగా అనిపిస్తుంది. హై-స్పీడ్‌లో గేర్లు మార్చేటప్పుడు బైక్ జర్క్ ఇవ్వకుండా స్మూత్‌గా సాగుతుంది.
టాప్ వేరియంట్‌లో హైటెక్ హంగులు
ఇక ఈ బైక్ టాప్ వేరియంట్ విషయానికి వస్తే.. ఇందులో అదనంగా యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్, కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ వంటి రేసింగ్ ఫీచర్లు యథావిధిగా కొనసాగుతాయి. తక్కువ ధర వేరియంట్లలో కూడా స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు రావడంతో, మధ్యతరగతి యువతకు ఈ బైక్ ఇప్పుడు ఒక అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు.
ఇంజిన్ పవర్.. తగ్గేదే లే
పెర్ఫార్మెన్స్ పరంగా టీవీఎస్ అపాచీ ఎప్పుడూ నెంబర్ వన్‌గానే ఉంటుంది. 2026 మోడల్‌లో కూడా అదే నమ్మకమైన 160cc ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 17.55 bhp గరిష్ట పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది తన సెగ్మెంట్లోనే అత్యంత శక్తివంతమైనది. ముఖ్యంగా ఇందులో స్పోర్ట్, అర్బన్, రైన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. వర్షం పడి రోడ్లు తడిగా ఉన్నప్పుడు లేదా సిటీ ట్రాఫిక్‌లో వెళ్లేటప్పుడు రైడర్ తన ఇష్టానుసారం బైక్ పవర్‌ను మార్చుకోవచ్చు. స్టైల్, టెక్నాలజీ మరియు పవర్ కలగలిసిన ఈ కొత్త అపాచీ, యువ రైడర్లకు ఫస్ట్ ఛాయిస్ కానుంది.

