Ntorq 125 : చేతక్ కు గట్టి షాక్.. రూ.లక్షలోపే టీవీఎస్ నుండి కొత్త స్కూటర్ వచ్చేసింది
రూ.లక్షలోపే టీవీఎస్ నుండి కొత్త స్కూటర్ వచ్చేసింది

Ntorq 125 : భారత మార్కెట్లో టీవీఎస్ మోటార్ కంపెనీ తమ ఎన్టార్క్ 125 కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఈసారి ఇది మార్వెల్ సూపర్ హీరో కెప్టెన్ అమెరికా థీమ్‌తో వచ్చింది. టీవీఎస్ ఎన్ టార్క్ 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ పేరుతో వచ్చిన ఈ మోడల్, ఇప్పటికే ఉన్న సూపర్ స్క్వాడ్ సిరీస్‌లో భాగం. గతంలో ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ థీమ్‌లతో వచ్చిన ఎన్ టార్క్ ఇప్పుడు కొత్త గ్రాఫిక్స్, డిజైన్‌తో కెప్టెన్ అమెరికా స్టైల్‌లో అందుబాటులోకి వచ్చింది.
ఈ సూపర్ సోల్జర్ వేరియంట్ 2020 కెప్టెన్ అమెరికా థీమ్‌ను ఆధారంగా చేసుకుని డిజైన్‌లో మార్పులు చేసింది. ఇప్పుడు ఇది బోల్డ్ గ్రాఫిక్స్, స్టార్, క్యామో-ప్రేరిత బాడీ ర్యాప్‌తో మరింత ఆకర్షణీయంగా ఉంది. ఈ కొత్త డిజైన్ యువతను ఆకర్షించడానికి ఉద్దేశించబడింది. ఎందుకంటే వారు స్టైల్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి. ఈ స్కూటర్‌లో 124.8 సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.37 బీహెచ్‌పీ పవర్, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్తో వస్తుంది. ఎన్ టార్క్ 125 కేవలం 8.9 సెకన్లలో 0-60 కి.మీ/గం టాప్ స్పీడ్ అందుకుంటుంది.
ఇందులో టీవీఎస్ బ్లూటూత్-ఎనేబుల్డ్ డిజిటల్ కన్సోల్ అయిన SmartXonnect ఫీచర్ యథావిధిగా ఉంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాలర్ ఐడి, రైడ్ స్టాటిస్టిక్స్ వంటి అనేక ఫీచర్లను అందిస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లను అందించిన మొట్టమొదటి స్కూటర్‌లలో ఎన్ టార్క్ ఒకటి, ఇది టెక్నాలజీ ఇష్టపడే రైడర్లకు ఒక స్పెషల్ అట్రాక్షన్. టీవీఎస్ ఎన్ టార్క్ 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ ధర రూ.98,117 (ఎక్స్-షోరూమ్). ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న టీవీఎస్ డీలర్‌షిప్‌లలో లభిస్తుంది. పర్ఫార్మెన్స్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, ఈ కొత్త డిజైన్, థీమ్ 125 సీసీ స్కూటర్ సెగ్మెంట్‌లో కొత్తదనాన్ని తీసుకొస్తుంది. మార్వెల్ అభిమానులకు ఇది మరింత ప్రత్యేకంగా అనిపించవచ్చు.
