TVS Raider 125 : మీరు ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లడానికి స్టైలిష్‌గా ఉంటూనే, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉండే బైక్ కోసం చూస్తున్నారా? అయితే టీవీఎస్ సంస్థ నుంచి వచ్చిన టీవీఎస్ రైడర్ 125 మీకు సరైన ఆప్షన్ అవుతుంది. ఈ బైక్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 83,410 కాగా, ఇది లీటరుకు దాదాపు 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అత్యంత శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లు, స్పోర్టీ లుక్స్ ఉండటం వల్ల భారతీయ మార్కెట్లో ఇది స్వల్ప కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందింది.

వేరియంట్లు, ధరలు మరియు ఇంజిన్ వివరాలు

టీవీఎస్ రైడర్ 125 మొత్తం 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో డ్రమ్, సింగిల్ సీట్, ఐగో, స్ప్లిట్ సీట్, ఎస్ఎస్ఈ, ఎస్‌ఎక్స్‌సి డిడి, టిఎఫ్టి డిడి వంటి వేరియంట్లు ఉన్నాయి. బేస్ మోడల్ ధర రూ. 83,410 కాగా, టాప్ మోడల్ టిఎఫ్టి డిడి వేరియంట్ ధర రూ. 99,620 వరకు ఉంది. ఈ బైక్‌లో 124.8 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7,500 rpm వద్ద 11.2hp పవర్, 6,000 rpm వద్ద 11.75Nm టాప్‌ను విడుదల చేస్తుంది. పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ కావాలనుకునే వారికి ఇది చక్కటి అనుభూతిని ఇస్తుంది.

వేరియంట్ పేరు ఎక్స్ షోరూమ్ ధర

డ్రమ్ రూ. 83,410

సింగిల్ సీట్ రూ. 89,020

ఐగో రూ. 93,570

స్ప్లిట్ సీట్ రూ. 93,570

ఎస్ఎస్ఈ రూ. 94,570

ఎస్‌ఎక్స్‌సి డిడి రూ. 97,775

టిఎఫ్టి డిడి రూ. 99,620

సాంకేతిక ఫీచర్లు, భద్రత

ఈ బైక్ సాధారణ డిజిటల్ డిస్‌ప్లేతో పాటు టాప్ వేరియంట్‌లో 5-ఇంచుల టీఎఫ్‌టీ స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో వాయిస్ అసిస్ట్, కాల్ మేనేజ్‌మెంట్, ఆన్-కాన్సోల్ నోటిఫికేషన్లు, టర్న్-బై-టర్న్ నెవిగేషన్ వంటి సరికొత్త స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే.. ఎస్‌ఎక్స్‌సి డిడి, టిఎఫ్టి డిడి వేరియంట్లలో డిస్క్ బ్రేక్‌లతో పాటు సింగిల్ ఛానల్ ఏబీఎస్ సౌకర్యం ఉంది. ట్రాఫిక్‌లో ఇబ్బంది లేకుండా బైక్ నెమ్మదిగా సాగిపోయేందుకు గ్లైడ్ త్రూ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు.

మైలేజ్, బరువు, రంగులు

టీవీఎస్ రైడర్ 125 ఏఆర్‌ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 56.7కిమీ కాగా, రోజువారీ ట్రాఫిక్ పరిస్థితుల్లో ఇది లీటరుకు 55 నుంచి 65 కిలోమీటర్ల వరకు సగటు మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ బరువు వేరియంట్‌ను బట్టి 123 కేజీల నుంచి 125 కేజీల వరకు ఉంటుంది. అలాగే రోడ్లపై సులువుగా ప్రయాణించేందుకు 180mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. ఈ బైక్ గ్రాఫిటీ గ్రే, సకిరి బ్లూ, బ్లేజింగ్ రెడ్, వికెడ్ బ్లాక్ వంటి మొత్తం 13 రకాల ఆకర్షణీయమైన రంగుల్లో దొరుకుతుంది. అంతేకాకుండా మార్వెల్ ప్రియుల కోసం బ్లాక్ పాంథర్, ఐరన్ మ్యాన్, డెడ్‌పూల్, వోల్వరిన్ థీమ్‌లతో కూడిన ప్రత్యేక ఎడిషన్లలోనూ అందుబాటులో ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story