ఫీచర్స్, పవర్, ధరలో ఏది బెస్ట్?

TVS Raider 125 vs Bajaj Pulsar NS125: భారతీయ మార్కెట్‌లో 125సీసీ సెగ్మెంట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఈ విభాగంలో యువతకు బాగా నచ్చిన బైకులలో టీవీఎస్ రైడర్ 125, బజాజ్ పల్సర్ NS125 ముఖ్యమైనవి. పల్సర్ NS125 తన స్పోర్టీ లుక్, శక్తివంతమైన పర్ఫార్మెన్స్, అధునాతన ABS ఫీచర్లతో ఆకర్షిస్తుంటే, టీవీఎస్ రైడర్ 125 ప్రీమియం ఫీచర్లు, స్మార్ట్ డిస్‌ప్లే, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతితో పేరు పొందింది. ఈ రెండింటిలో ఏ బైక్ మెరుగైనదో తెలుసుకోవడానికి వాటి కీలక వివరాలను తెలుసుకుందాం.

ఈ రెండు బైక్‌లలో టెక్నాలజీ పరంగా రైడర్ 125 ఒక అడుగు ముందు ఉంది. టీవీఎస్ రైడర్ 125 TFT డిజిటల్ కన్సోల్ చాలా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. దీని కలర్ డిస్‌ప్లే ఇంటరాక్టివ్‌గా ఉండి, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్/మెసేజ్ అలర్ట్‌లు, టర్న్-బై-టర్న్ నేవిగేషన్ వంటి ఫీచర్‌లను అందిస్తుంది. కొత్త పల్సర్ NS125 లో LCD డిజిటల్ కన్సోల్ మాత్రమే ఉంది. ఇది ఆధునికంగా కనిపించినా, ఫీచర్ల విషయంలో రైడర్ TFT డిస్‌ప్లే అంత అడ్వాన్స్‌డ్‌గా అనిపించదు. ఈ పోలికలో రైడర్ 125 కన్సోల్ మెరుగైనది.

రైడింగ్ అనుభవం, సేఫ్టీ ఫీచర్లలో రెండు బైక్‌లు ప్రత్యేకంగా ఉన్నాయి.టీవీఎస్ రైడర్ 125 ఎకో, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. ఇవి పర్ఫార్మెన్స్, మైలేజ్ మధ్య బ్యాలెన్స్ సాధిస్తాయి. ఇందులో ఉన్న iGo అసిస్ట్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ సిటీ ట్రాఫిక్‌లో రైడింగ్‌ను స్మూత్, మరింత పొదుపుగా చేస్తుంది. బజాజ్ పల్సర్ NS125 ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా మూడు-దశల ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను అందిస్తోంది. ఇందులో రోడ్, రైన్, ఆఫ్-రోడ్ మోడ్‌లు ఉన్నాయి. ఇవి విభిన్న పరిస్థితులలో మెరుగైన కంట్రోల్, సేఫ్టీని ఇస్తాయి. సేఫ్టీ పరంగా NS125 మెరుగ్గా కనిపిస్తే, సిటీ రైడింగ్‌లో రైడర్ 125 సున్నితమైన అనుభూతిని ఇస్తుంది.

రెండు బైక్‌లు దాదాపు ఒకే ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, పల్సర్ NS125 కొంచెం ఎక్కువ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. పల్సర్ NS125 124.45సీసీ ఇంజిన్ 12 PS పవర్, 11 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. టీవీఎస్ రైడర్ 125 124.8సీసీ ఇంజిన్ 11.4 PS పవర్, 11.2 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. రెండింటిలోనూ 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. రైడర్ బరువు తక్కువగా ఉండటం వలన సిటీలో మరింత యాక్టీవ్ గా ఉండి మెరుగైన మైలేజీని అందిస్తుంది.

ధర విషయానికి వస్తే రైడర్ 125 సుమారు ధర రూ. 95,600, బజాజ్ పల్సర్ NS125 ధర సుమారు రూ. 98,400.ఈ ధరల వ్యత్యాసం, రైడర్ అందించే అదనపు టెక్ ఫీచర్లను పరిగణనలోకి తీసుకుంటే టీవీఎస్ రైడర్ 125 కొంచెం మెరుగైన వ్యాల్యూ ఫర్ మనీ ఆప్షన్ గా నిలుస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story