TVS: మార్కెట్లోకి కొత్త లుక్‌తో టీవీఎస్ అపాచే బైకులు.. అదిరిపోయే ఫీచర్లు, ధరలు ఇవే!
అదిరిపోయే ఫీచర్లు, ధరలు ఇవే!

TVS: దేశీయ ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తన పాపులర్ అపాచే బైక్ లైనప్‌ను భారీగా అప్‌డేట్ చేసింది. అపాచే ఆర్‌టీఆర్ 160, ఆర్‌టీఆర్ 160 4వి, ఆర్‌టీఆర్ 200 4వి మోడళ్లను కొత్త రంగులు, అదిరిపోయే ఫీచర్లు, అత్యాధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బైకుల్లో ట్రాక్షన్ కంట్రోల్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, మ్యాప్ మిర్రరింగ్ వంటి ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు చేర్చబడ్డాయి. ఎక్స్-షోరూమ్ ప్రకారం కొత్త అపాచే ఆర్‌టీఆర్ 160 ప్రారంభ ధర రూ.1.28 లక్షలు ఉండగా, ఆర్‌టీఆర్ 160 4వి టాప్ వేరియంట్ ధర రూ.1.41 లక్షలు, అపాచే 200 4వి టాప్ మోడల్ ధర రూ.1.50 లక్షలుగా నిర్ణయించబడింది.
2026 టీవీఎస్ అపాచే ఆర్‌టీఆర్ 160 ప్రత్యేకతలు
అపాచే ఆర్‌టీఆర్ 160 కొత్త టాప్ వేరియంట్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో పాటు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS)ను అందించారు. దీనితో పాటు భద్రతను పెంచేందుకు హజార్డ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు. రంగుల విషయానికి వస్తే.. ఈ బైక్ ఆర్కిటిక్ టీల్, గ్రేనైట్ గ్రే సింగిల్-టోన్ రంగులతో పాటు మ్యాట్ బ్లాక్ విత్ రెడ్ అల్లాయ్ వీల్స్, పర్ల్ వైట్ విత్ రెడ్ అల్లాయ్ వీల్స్ వంటి ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ ఆప్షన్లలో లభిస్తుంది.
అపాచే ఆర్‌టీఆర్ 160 4విలో టీఎఫ్‌టీ డిస్‌ప్లే మ్యాజిక్
ఆర్‌టీఆర్ 160 4వి కొత్త టాప్ వేరియంట్‌లో అత్యాధునిక టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో కూడిన గూగుల్ మ్యాప్ మిర్రరింగ్ సౌకర్యం కల్పించారు. దీని ద్వారా రైడర్లు తమ బైక్ స్క్రీన్ పైనే నేవిగేషన్‌ను సులభంగా చూసుకోవచ్చు. అలాగే ఇందులో పానిక్ బ్రేక్ అలర్ట్, టైప్-సి చార్జర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ బైక్ మ్యాట్ బ్లాక్, రేసింగ్ రెడ్, మెరైన్ బ్లూ రంగులతో పాటు ఆర్కిటిక్ టీల్ విత్ షాంపైన్ గోల్డ్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.
అపాచే ఆర్‌టీఆర్ 200 4విలో అదిరిపోయే అప్‌డేట్స్
ఈ మూడు బైకుల్లో కెల్లా అపాచే ఆర్‌టీఆర్ 200 4వికి అత్యధిక ఫీచర్ అప్‌డేట్లు దక్కాయి. ఇందులో ముందు వైపు అడ్జస్టబుల్ యూఎస్‌డీ సస్పెన్షన్ ఇచ్చారు. గూగుల్ మ్యాప్ మిర్రరింగ్, పానిక్ బ్రేక్ అలర్ట్, టైప్-సి చార్జర్ వంటి ఫీచర్లు దీని సొంతం. ఈ బైక్ ఆర్మరీ గ్రీన్, రేసింగ్ రెడ్, మ్యాట్ బ్లాక్ రంగులతో పాటు సెపాంగ్ బ్లూ విత్ రెడ్ అల్లాయ్ వీల్స్ డ్యూయల్-టోన్ ఆప్షన్‌లో లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా అపాచే బ్రాండ్ 70 లక్షలకు పైగా రైడర్ల మైలురాయిని దాటడం విశేషం.

